Pineapple : పైనాపిల్ తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Pineapple : పైనాపిల్ తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా...!!
Pineapple : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో పైనాపిల్ కూడా ఒకటి. అయితే ఈ పైనాపిల్ పండును తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ పైనాపిల్ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే ఈ పండులో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఈ పండులో ఉన్న తీపిని మరియు పిలుపును తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. అలాగే ఇది విటమిన్ సి కి అద్భుత మూలం అని కూడా చెప్పొచ్చు. ఈ పైనాపిల్ లో ఉన్న బ్రోమోలైన్ ఎంజైమ్ జీర్ణ క్రియకు ఎంతో హెల్ప్ చేస్తుంది…
పైనాపిల్ పండులో విటమిన్ సి మరియు పోలేట్, కాపర్, మాంగనీస్, డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటున్నారు నిపుణులు. కానీ పైనాపిల్ తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం వాటికి ఎంతో దూరంగా ఉంటారు. అంతేకాక ఈ పైనాపిల్ లో సహజ చక్కెరలు మరియు కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అనేది బాగా పెరుగుతుంది. అప్పుడే ఆరోగ్యం అనేది అకస్మాత్తుగా క్షినిస్తుంది…
పైనాపిల్ తీసుకోవడం వలన కడుపులో అల్సర్ మరియు అసిడిటీ సమస్య ఉన్నవారికి మరిన్ని సమస్యలు వచ్చి పడతాయి. ఈ పండును తీసుకోవడం వలన సమస్యలు అనేవి మరింత ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి టైం లో పైనాపిల్ తీసుకోవడం అంత మంచిది కాదు. అలాగే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు విటమిన్స్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. కావున కిడ్నీలు పాడవకుండా రక్షించుకోవాలి అంటే మితంగా తీసుకుంటేనే మంచిది