Pregnant Womens : గర్భిణీ స్త్రీలు ఈ నాలుగు పండ్లను తింటే చాలు.. ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డ మీ సొంతం…
Pregnant Womens : స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు 9 నెలల వరకు ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ ను తీసుకుంటూ ఉండాలి. కడుపులో ఉన్న బిడ్డకు అలాగే తల్లికి ఇద్దరి కి సరియైన ఫుడ్ కావాలి. ఇలాంటి సమయంలో ఐరన్, ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్ సి, ఇమ్యూనిటీ తల్లి బిడ్డలకు ఎంతో అవసరం. ఇలాంటి ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. బిడ్డ ఆరోగ్యంగా, అందంగా ఉండాలి అంటే ఏం తినాలి.
1 వది బత్తాయి పండు దీనిలో ఐరన్, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ బత్తాయి జ్యూస్ రోజు త్రాగుతూ ఉండాలి. ఇలా త్రాగడం వలన బ్లడ్ బాగా పెరుగుతుంది. అలాగే మలబద్ధక సమస్యలు కూడా తగ్గుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కడుపులో ఉన్న బిడ్డకు తల్లికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా కాపాడతాయి.
2వది జామ పండు దీనిలో విటమిన్ సి, అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ జామ పండ్లను రోజు రెండు తింటూ ఉండాలి. ఇలా తినడం వలన బిడ్డ శరీర ఎదుగుదలకు డిఎన్ఏ విభజన జరిగేటప్పుడు కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి కెమికల్స్ ను క్లీన్ చేయడంలో ఈ జామ బాగా ఉపయోగపడుతుంది.
3వది అందరికీ అనుకూలంగా ఉండే పండు ఈ అరటిపండు ఈ పండులో క్యాల్షియం బాగా ఉంటుంది. అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పండుని తినడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ శక్తి వస్తుంది.
4వది అవకాడో ఈ అవకాడో లో మంచి కొవ్వు అధిక మొత్తంలో ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్ కె, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఈ పండు తినటం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
ఈ పండు అందరికీ అందుబాటులో ఉండదు. కాబట్టి దీని ప్లేసులో మామిడిపండు కూడా తీసుకోవచ్చు. వీటితోపాటు సాధారణంగా కొన్ని పండ్లను, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, పాలు ఇలా చాలా రకాల ఐటమ్స్ తినవచ్చు కానీ పైన చెప్పుకున్న నాలుగు పండ్లను మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన, అలాగే అందమైన బిడ్డ జన్మిస్తుంది.