Health Benefits : ఈ పండులో మెండుగా పోషకాలు.. తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
Health Benefits : మనలో సీతాఫలం గురించి చాలా మందికి తెలుసు.. కానీ రామాఫలం గురించి తెలియని వారు చాలా మందే ఉన్నారు. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. ఇది సీతాఫలం జాతికి చెందిన పండు. ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. రుచి కూడా బాగుంటుంది. గతంలో పురుషులు ఈ పండును చాలా ఇష్టంగా తినేవారు. కానీ ఈ పండు మన దేశానికి చెందినది కాదు. ఇది దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే మొక్కలను మన దేశానికి ఫస్ట్ టైం పదహారవ శతాబ్దంలో పోర్చుగ్రీసు వారు తీసుకొచ్చారని తెలుస్తోంది. మన రాష్ట్రంలో సీతాఫలం పండ్లు ఎక్కువగా పండుతాయి.
వీడితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రామాఫలాలు ఎక్కువగా పండుతాయి. ప్రస్తుతం సూపర్ మార్కెట్ లు అందుబాటులోకి రావడంతో ఈ పండు మనకు దొరుకుతుంది. దీనిని బుల్ హార్ట్ అని కూడా పిలుస్తారు. సీతాఫలంతో పోలిస్తే రామఫలంలో గింజలు తక్కువగా, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. ఈ పండు బాడీకి వెంటనే ఎనర్జీని ఇస్తుంది.రామఫలంలో మలేరియా, క్యాన్సర్ వ్యాధులకు కారణమయ్యే కణాలను నివారించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను సైతం తగ్గిస్తుంది. బాడీలో అధిక కొలెస్ట్రాల్, హై బీపీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
Health Benefits : మలేరియా కణాల నివారణ
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల హెమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. బాడీలో వివిధ కణాలకు ఆక్సిజన్ రవాణా చేయడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి రామఫలం మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు రామాఫలం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందులో ఉండే పోషకాలు వివిధ వ్యాధులను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. అందులో ఈ పండు దొరికినప్పుడు తినడం బెటర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.