Ranapala Leaf : మొక్కే కదా అని చీప్ గా చూస్తున్నారా..? 100 రోగాలకు ఒక్కటే దివ్య ఔషధం…!
ప్రధానాంశాలు:
Ranapala Leaf : మొక్కే కదా అని చీప్ గా చూస్తున్నారా..? 100 రోగాలకు ఒక్కటే దివ్య ఔషధం...!
Ranapala Leaf : ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధాన కర్తవ్యం గా మారింది. అందుకే ప్రకృతి సంపద యొక్క విశిష్టతను వివరించి ఆరోగ్య రక్షణకై ఈ సృష్టి సంపదను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఎన్నో సమస్యలను చెక్ పెట్టడానికి ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది.అదే రణపాల మొక్క. ఈ రణపాల మొక్కలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది శరీరంలో వచ్చే దాదాపుగా అన్ని రోగాలపై అద్భుతంగా పనిచేస్తుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, రక్తపోటు, డయాబెటిస్, పుండ్లు, చర్మవ్యాధులు, వేడి పొక్కులు, గుండె వ్యాధులు, మూత్రనాళాలకు సంబంధించిన సమస్యలకు రక్త శుద్ధికి జుట్టు పట్టుత్వానికి గ్యాస్ట్రిక్ అల్సర్లకు మోకాళ్ళ నొప్పులకు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఇలా ఒక్కటేమిటి ఈ రణపాల అనేక రోగాలకు ఏకైక పరిష్కారంగా చెప్పవచ్చు.. రణపాల ఆకు పేరు చెబితే చాలు. ఎలాంటి రోగానికైనా హడాలంటే అతిశయోక్తి కాదు.
అంతటి మహత్తర శక్తి ఉంది. ఈ రణపాల ఆకులు రణము అంటే శోధన పాల అంటే దాన్ని శాసించేది అని అర్థము.రణపాల ఆకుని లీఫ్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. దీనికి జీవాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది. కాబట్టి దీనికి లీఫ్ ఆఫ్ లైఫ్ అని పేరు వచ్చింది. దీన్ని శాస్త్రీయంగా బయోపిలం అని అంటుంటారు. ఈ రణపాల మొక్కకి 10 నుండి 15 రోజులపాటు నీళ్లు పోయకపోయినా కూడా ఇవి వాడిపోకుండా ఉంటాయి. రణపాల ఆరోగ్యానికి చేసే ఒకటి కాదు రెండు కాదు. దాదాపు100 రోగాలకు ఒక్కటే మందు. ఈ రణపాల ఈ మొక్కని మనమందరం మన ఇళ్లల్లోనే పెంచుకోవచ్చు. ఎలాంటి నేలపై అయినా ఈ మొక్క బ్రతుకుతుంది. పెరట్లోనే ఈ మొక్కను పెంచుకుంటూ రోజు ఆ చెట్టు ఆకులని తింటుంటే ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవు. ఈ రణపాల యోక్క ఔషధ గుణాలు వాటి ప్రయోజనాలు అవగాహన ఉంటే చాలు. ప్రకృతిలో లభ్యమయ్యే మూలికల సంపదతో సకలారిష్టాలకు రణపాల ఆకుని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఇక రణపాల ఆకు యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది కిడ్నీలో రాళ్లకు బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుంది. ఈ ఆకు జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్లతో పాటు మూత్రశయంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
ఈ రణపాల ఆకుని మెత్తగా నూరి గాయాలపైన వేడి పొక్కుల పైన పూతలా రాసుకుంటే పుండు రెండు రోజుల్లో మటు మాయమవుతుంది. రణపాల ఆకులపై ఉప్పు రాసి నమిలిన చాలు. ఈ రసం రక్త శుద్ధికి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో మలినాలన్నీ పోవడమే కాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తొలగిపోయి రక్త ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది. రణపాల ఆకులను మెత్తగా నూరి జ్యూస్ లా తాగితే గ్యాస్టిక్ సమస్యలు దరిచేరవు. రణపాల ఆకుల జ్యూస్ అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్.. అంతేకాదు ఈ ఆకులో ఉన్న ఆంటీ ఇన్ఫ్లమేటరీ ఆంటీ ఎలర్జీ యాంటీబయాటిక్ గుణాలు కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, తలనొప్పి, మెడనొప్పి వంటి ఎటువంటి రోగానికైనా అద్భుతంగా పనిచేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రణపాల ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇందాకాదు..