
Rosemary tea benefits
Tea Benefits : భారతీయులకు టీ త్రాగనిదే ఆ రోజు మొదలు అవ్వదు. ఉదయం లేవగానే టీ కాఫీలు త్రాగాల్సిందే. టీ కాఫీలు త్రాగడం వలన బాడీ ఆక్టివ్ గా అవుతుంది. ఎటువంటి ఒత్తిడి అయినా క్షణాల్లో రిలీజ్ అవుతుందని ఫీలవుతుంటారు. అందుకే ఉదయం సాయంత్రం టి తప్పకుండా త్రాగుతారు. అయితే రొటీన్ గా త్రాగే బదులుగా రోజ్ మేరీ టీ తాగితే టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజ్ మెరీ టీ మనసును శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది. ఈ రోజ్ మేరీ టీ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఈ టీ త్రాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
రోజ్మేరీలో రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. యాంటీఆక్సిడెంట్లు ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి సెల్యులార్ నష్టం, వాపును తగ్గించడానికి తోడ్పడతాయి. అలాగే జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి, బైల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం విచ్ఛిన్నం, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు రోజ్మేరీ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
Rosemary tea benefits
రోజ్మేరీ టీ వాసనను పీల్చడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. బ్రెయిన్ యాక్టివ్‌గా పనిచేస్తుంది. రోజ్మెరీలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడును ఆరోగ్యంగా ఉంచతాయి. రోజ్మేరీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలోని ఔషధ గుణాలు ప్రేగులలో చక్కెరను తగ్గిస్తాయి. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. రోజ్మేరీలో కార్నోసోల్ అనే ఫైటోకెమికల్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ సంబంధిత హార్మోన్ల ఉత్పత్తిని పరిమితం చేస్తుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.