Tea Benefits : ఈ వెరైటీ టీ ఎప్పుడైనా త్రాగారా .. రుచికి రుచి , ఆరోగ్యానికి ఆరోగ్యం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea Benefits : ఈ వెరైటీ టీ ఎప్పుడైనా త్రాగారా .. రుచికి రుచి , ఆరోగ్యానికి ఆరోగ్యం..!

 Authored By aruna | The Telugu News | Updated on :20 June 2023,7:00 am

Tea Benefits : భారతీయులకు టీ త్రాగనిదే ఆ రోజు మొదలు అవ్వదు. ఉదయం లేవగానే టీ కాఫీలు త్రాగాల్సిందే. టీ కాఫీలు త్రాగడం వలన బాడీ ఆక్టివ్ గా అవుతుంది. ఎటువంటి ఒత్తిడి అయినా క్షణాల్లో రిలీజ్ అవుతుందని ఫీలవుతుంటారు. అందుకే ఉదయం సాయంత్రం టి తప్పకుండా త్రాగుతారు. అయితే రొటీన్ గా త్రాగే బదులుగా రోజ్ మేరీ టీ తాగితే టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజ్ మెరీ టీ మనసును శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది. ఈ రోజ్ మేరీ టీ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఈ టీ త్రాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.

రోజ్మేరీలో రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. యాంటీఆక్సిడెంట్లు ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి సెల్యులార్ నష్టం, వాపును తగ్గించడానికి తోడ్పడతాయి. అలాగే జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి, బైల్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం విచ్ఛిన్నం, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు రోజ్మేరీ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Rosemary tea benefits

Rosemary tea benefits

రోజ్మేరీ టీ వాసనను పీల్చడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. బ్రెయిన్‌ యాక్టివ్‌గా పనిచేస్తుంది. రోజ్మెరీలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడును ఆరోగ్యంగా ఉంచతాయి. రోజ్మేరీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలోని ఔషధ గుణాలు ప్రేగులలో చక్కెరను తగ్గిస్తాయి. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. రోజ్మేరీలో కార్నోసోల్ అనే ఫైటోకెమికల్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ సంబంధిత హార్మోన్ల ఉత్పత్తిని పరిమితం చేస్తుంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది