Saalads : అబ్బా… సలాడ్ తో ఇన్ని ప్రయోజనాలా… తెలిస్తే నోరెళ్ళ పెడతారు…!
Saalads : చాలామందికి తెలియదు సలాడ్లు తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నది.. అందుకే చాలామంది వాటిని తినరు. కానీ ఆరోగ్య నిపుణులు సలాడ్లు తినమని చెప్తూ ఉంటారు. ఈ సలాడ్లలలో బోలెడు పోషకాలు ఉంటాయి. సహజంగా సలాడ్ లో ఉల్లిపాయలు, ముల్లంగి, క్యారెట్, కొత్తిమీర, దోసకాయ, నిమ్మరసం, నల్ల ఉప్పును వాడుతారు. కాబట్టి వాటి కలయిక సూపర్ ఫుడ్ మాదిరిగా ఉంటుంది. కావున భోజనంలో సలాడ్ ను తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. సలాడ్ తినడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మానసిక ఆరోగ్యానికి మేలు : సలాడ్ లో ఉండే విటమిన్లు మినరల్స్ మన మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మానసిక ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ బి మెగ్నీషియం ఉండడం వల్ల ఆందోళన ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.
రక్తపోటు కంట్రోల్ : సలాడ్లు ఉండే మెగ్నీషియం, పొటాషియం, లాంటి కణజాలు రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి. ఇవి అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ప్రధానంగా ఉద్యోగులు అధికంగా ఉన్న ఇండియాలో సలాడ్ తినడం వారికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది.
అధిక బరువు కంట్రోల్ : సలాడు తక్కువ క్యాలరీలు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి.
ఇది బరువు పెరగడాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు ను ప్రోత్సహిస్తుంది.
పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది : విటమిన్ సి విటమిన్లు, పొటాషియం, విటమిన్ ఏ ఇలాంటి ఎన్నో పోషకాలు సలాడ్లో ఉంటాయి. ఈ మూలకాలు శారీరిక అభివృద్ధికి ,రక్తం స్వచ్ఛతకు, చర్మరక్షణకు, శరీర బలం కు సహాయపడతాయి.
జీర్ణ క్రియ మెరుగుపడుతుంది : సలాడ్లులలో తగినంత మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇది మంచి జీర్ణక్రియను నిర్వహిస్తుంది. మలబద్ధకం నుంచి బయటపడేస్తుంది. గ్యాస్ను తగ్గించడంతోపాటు కడుపులో ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.