Sea Food : సముద్రపు ఆహారాలను ఎక్కువగా తింటున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sea Food : సముద్రపు ఆహారాలను ఎక్కువగా తింటున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 August 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Sea Food : సముద్రపు ఆహారాలను ఎక్కువగా తింటున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!

Sea Food : పీతలు మరియు రొయ్యలు మరియు చేపలు సముద్ర ఆహారాలను తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వీటితో పాటుగా అక్టోపస్, స్క్విండ్, ఎండ్రా కాయలు లాంటి ఇతర సీఫుడ్ ఆహారాలు కూడా ఇతర రెస్టారెంట్లలో చాలా ఫేమస్. అయితే ఈ సీఫుడ్ ఆహారాలను తీసుకోవడం ఎంత మంచిదో, ప్రమాదాలు కూడా అంతే ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని వండుకునే ముందు సరిగ్గా క్లీన్ చేయకపోతే ఫుడ్ అలర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ పెను ప్రమాదాలను నియంత్రించాలంటే ఈ కింద చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. రొయ్యలు లేక పీతలను మార్కెట్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఎక్కువసేపు నిలవ ఉంచటం మంచిది కాదు. వాటిని వీలైనంత తొందరగా క్లీన్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే మంచిది. వీటిల్లో ముఖ్యంగా చేపలు. వీటిని వెంటనే క్లిన్ చేయాలి. లేదంటే తొందరగా పాడవుతాయి.

వాటిని మార్కెట్లో కొనే ముందు అవి నిల్వచేసినవో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ప్యాక్ చేసినటువంటి ఆహారాలను తీసుకుంటే దాని ఎక్స్పైరీ డేట్ ను చెక్ చేసుకోవాలి. అలాగే వాసన పై కూడా శ్రద్ధ పెట్టాలి. ఇవి గనక అమ్మోనియా లాంటి వాసన ఉన్నట్లయితే, ఇవి తాజాగా లేవు అని అర్థం చేసుకోవాలి. అంతేకాక చేపల యొక్క రంగును కూడా చెక్ చేయాలి. అయితే ఇవి ముదురు రంగులో ఉన్న మరియు దుర్వాసన ఎక్కువగా వచ్చినా ఆ చేపలను తీసుకోకపోవడం ఉత్తమం. అయితే రొయ్యలు మరియు పీతలను మాత్రం బాగా క్లీన్ చేయాలి. అలాగే సముద్ర చేపలలో సీసం మరియు కాడ్మియం లాంటి భారీ లోహాలు ఉంటాయి. కావున వాటిని బాగా క్లీన్ చేయకపోతే అవి శరీరంలోకి ప్రవేశించి గుండెపై ప్రభావం చూపిస్తాయి…

Sea Food సముద్రపు ఆహారాలను ఎక్కువగా తింటున్నారా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

Sea Food : సముద్రపు ఆహారాలను ఎక్కువగా తింటున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!

సీఫుడ్ ను ఫ్రిజ్ లో ఉంచినా, వాటిని ఎక్కువ టైం ఫ్రిజ్ లో ఉంచడం కూడా మంచిది కాదు. ఎందుకు అంటే. సీఫుడ్ ను ఎక్కువసేపు ఫ్రిజ్ లో గనక ఉంచితే బ్యాక్టీరియా అనేది సోకుతుంది. దీంతో కడుపునొప్పి, అతిసారం, వాంతులు, ఫుడ్ ఫాయిజన్ లాంటి వాటికి కారణం అవుతుంది. కావున వీటిని ఫ్రిజ్ లో ఉన్న మూడు నాలుగు రోజులలోనే తినడం మంచిది. అలాగే సముద్రపు ఆహారములో శరీరానికి హాని కలిగించే ఇతర పరాన్నా జీవులు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున వాటిని బాగా క్లీన్ చేసి ఎక్కువ వేడి మీద ఉడికించాలి. ఇలా చేయడం వలన వాటిపై ఉన్న అన్ని క్రిములు కూడా చనిపోతాయి. వీటిని గనక పచ్చిగా లేక మామూలుగా ఉడికించి తింటే చాలా ప్రమాదం. అయితే సాల్మోనెల్ల అనే బ్యాక్టీరియా సముద్ర ఆహారంలో ఎక్కువగా పెరుగుతుంది. కావున వండిన ఆహారంతో పచ్చి సముద్రపు ఆహారాలను చేర్చుకోవడం మంచిది కాదు…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది