Fennel Seeds : వేసవిలో మంటను తగ్గించే సోంపు షర్బత్.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
ప్రధానాంశాలు:
Fennel Seeds : వేసవిలో మంటను తగ్గించే సోంపు షర్బత్.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
Fennel Seeds : వేసవిలో చాలా మంది చల్లగా ఏదైనా తాగేందుకు ఇష్టపడుతుంటారు. తాగే పానీయాలు చల్లగా ఉండాలని కోరుకుంటారు. వేడినుంచి తప్పించుకునేందుకు శరీరాన్ని చల్లబరుచుకునేందుకు చల్లటి పానీయాలను తాగాలని కోరుకుంటారు. కాగా జ్యూస్ లు, కొబ్బరి నీళ్లు లాంటివి తాగేందుకు ఇష్టపడుతారు. ఇలాంటి ఓ కూల్ జ్యూస్ గురించి మీకు ఇప్పుడు చెబుతాం. దాని వల్ల చల్లదనమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోంపు మనందకీ బాగా తెలుసు. అయితే దీన్ని మౌత్ ప్రెషర్ గా మాత్రమే కాకుండా జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Fennel Seeds : జీర్ణక్రియకు..
సోంపు జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. కడుపు ఉబ్బరంతో పాటు గ్యాస్ ప్రాబ్లమ్ ను కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా అజీర్ణం లాంటి సమస్యలను కూడా తగ్గించేందుకు సాయం చేస్తుంది. మరీ ముఖ్యంగా మలబద్దకం సమస్యలు దరి చేరకుండా చూస్తుంది.
Fennel Seeds : ఫ్రెషెన్స్ బ్రీత్ ..
ఈ సోంపు షర్బత్ ను తాగితే శ్వాస కూడా తాజాగా ఉంటుంది. నోట్లో లాలాజల ఉత్పత్తిని పెంచేందుకు సాయం చేస్తుంది. అంతే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి నోటిని శుభ్రంగా ఉంచుతుంది.
Fennel Seeds : మల్లబద్దక సమస్యలు దూరం..
సోంపు షర్బత్ ను తాగడం వల్ల మలబద్దకం సమస్య పూర్తిగా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సోంపులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. పేగు కదలికలను సులభతరం చేయడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
Fennel Seeds : కడుపులో మంటను తగ్గిస్తుంది..
సోంపు షర్బత్ ను తాగడం వల్ల కడుపులో మంటను ఈజీగా తగ్గిస్తుంది. ఇది జీర్ణాశయంలోని కండరాలను సడలించడంలో సాయం చేస్తుంది. అంతే కాకుండా గ్యాస్ ను కడుపులో తగ్గించేస్తుంది. ఈ సోంపు షర్బత్ ను తయారు చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్లు సోంపుతో పాటు అరకప్పు చెక్కర తో పాటు కొంత తేనెను ఉపయోగించుకోవాలి. కొంత నిమ్మకాయ రసం కూడా తీసుకోవాలి. కొద్దిగా వాటర్ ను కలుపుకుంటే సరిపోతుంది.