Chicken with skin vs without skin : చికెన్ స్కిన్ తో తినాలా?.. స్కిన్ లేకుండా తినాలా.. ఏది బెస్టో మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken with skin vs without skin : చికెన్ స్కిన్ తో తినాలా?.. స్కిన్ లేకుండా తినాలా.. ఏది బెస్టో మీకు తెలుసా..?

 Authored By suma | The Telugu News | Updated on :19 January 2026,7:00 am

ప్రధానాంశాలు:

  •  Chicken with skin vs without skin: చికెన్ స్కిన్ తినాలా?.. తీసేయాలా?.. సైన్స్ ఏమంటోంది తెలుసా!

Chicken with skin vs without skin: చాలామందికి చికెన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కొందరైతే ప్రతిరోజూ తినమన్నా వెనకాడరు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చికెన్ కూర లేనిదే భోజనం పూర్తవదన్నట్టే ఉంటుంది. అయితే చికెన్ వండే ముందు చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తుంది. చికెన్ స్కిన్‌తో తినాలా? లేక స్కిన్ తీసేసి తినాలా? అసలు ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు సైన్స్ ఆధారంగా తెలుసుకుందాం.

Chicken with skin vs without skin చికెన్ స్కిన్ తో తినాలా స్కిన్ లేకుండా తినాలా ఏది బెస్టో మీకు తెలుసా

Chicken with skin vs without skin : చికెన్ స్కిన్ తో తినాలా?.. స్కిన్ లేకుండా తినాలా.. ఏది బెస్టో మీకు తెలుసా..?

Chicken with skin vs without skin: చికెన్ చర్మంలో నిజంగా ఏముంది?

పోషకాహార నిపుణుల మాట ప్రకారం చికెన్ చర్మంలో ఎక్కువ భాగం కొవ్వే ఉంటుంది. సుమారు మూడింట రెండు వంతులు ఫ్యాట్ ఉండటం గమనార్హం. కానీ ఇందులో ఉన్న కొవ్వు అంతా చెడ్డదే అనుకోవడం తప్పు. ఇందులో ఎక్కువగా అసంతృప్త కొవ్వులు (Unsaturated fats) ఉంటాయి. ఇవి ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి ఉండి గుండె ఆరోగ్యానికి కొంతవరకు మేలు చేస్తాయి. అంతేకాదు సరైన మోతాదులో తీసుకుంటే రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అయితే ఇదంతా మితంగా తినాలి అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Chicken with skin vs without skin: కేలరీల పరంగా ఎంత తేడా ఉంటుంది?

బరువు తగ్గాలనుకునేవారికి లేదా ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టేవారికి కేలరీల లెక్క చాలా ముఖ్యం. స్కిన్ లెస్ చికెన్ (170 గ్రాములు) సుమారు 280 కేలరీలు మాత్రమే. స్కిన్‌తో ఉన్న చికెన్ (170 గ్రాములు) దాదాపు 380 కేలరీలు. అంటే కేవలం చర్మం వల్లే దాదాపు 100 అదనపు కేలరీలు శరీరంలోకి వెళ్తాయి. రోజూ ఇలా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువ. అందుకే డైట్‌లో ఉన్నవారు లేదా షేప్‌లో ఉండాలనుకునేవారు స్కిన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Chicken with skin vs without skin: రుచి, ఆరోగ్యం రెండూ కావాలంటే ఇలా చేయండి

చికెన్‌ను స్కిన్‌తో ఉడికించడం వల్ల ఒక మంచి ప్రయోజనం ఉంటుంది. వండే సమయంలో చర్మంలోని సహజ నూనెలు మాంసంలోకి చేరి చికెన్‌ను మృదువుగా, రుచిగా మారుస్తాయి. దీంతో చికెన్ ఎండిపోకుండా జూసీగా ఉంటుంది. అయితే ఉత్తమమైన పద్ధతి ఏంటంటే వండే సమయంలో స్కిన్ ఉంచి తినే ముందు తీసేయడం. ఇలా చేస్తే అనవసరమైన కొవ్వు శరీరంలోకి వెళ్లకుండా కూడా ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం స్కిన్‌కు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది.

. బరువు తగ్గాలనుకునేవారు
. గుండె జబ్బులు ఉన్నవారు
. మధుమేహం ఉన్నవారు
. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు

ఇలాంటి వారు లీన్ ప్రోటీన్ కోసం స్కిన్ లెస్ చికెన్ లేదా చికెన్ బ్రెస్ట్‌ను ఎంచుకోవడం ఉత్తమం. జిమ్‌కు వెళ్లేవారు కండరాల పెరుగుదల లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఇది మరింత ఉపయోగకరం. ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు. చికెన్ స్కిన్ మంచిదా? చెడ్డదా? అన్నదానికంటే మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో చూసుకుని నిర్ణయం తీసుకోవడమే అసలైన సైన్స్.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది