Sugandha Kokila Oil : సుగంధ కోకిల నూనెతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల ? తప్పక తెలుసుకోవాలి..!
Sugandha Kokila Oil : సుగంధ కోకిల నూనెతో ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. సుగంధ కోకిల ఎండిన బెర్రీల నుంచి తీస్తారు. ఈ సుగంధ కోకిల ఆయిల్ ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ నూనె ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. సుగంధ కోకిల నూనె కేంద్ర నాడీ వ్యవస్థకు సహజమైన టానిక్కులా పనిచేస్తుంది. ఈ ఆయిల్ మనసుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం అందిస్తుంది.
సుగంధ కోకిల యాంటీ ఇన్ఫలర్మేటివ్ లక్షణాలున్న కారణంగా శరీరంలో వాపు, నొప్పి చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. సుగంధ కోకిల నూనె జీర్ణవ్యవస్థకు అద్భుతమైన టానిక్ లాగా ఉపయోగపడుతుంది.దీనిలో యాంటీసెప్టిక్ యాంటీ మైక్రోబయో లక్షణాలతో నుండి ఉంటుంది. చర్మం జుట్టుకు సుగంధ కోకిల నూనె మేలు చేస్తుంది. చాలామంది ముఖంపై మొటిమలు, మచ్చలు, మంగు మచ్చలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారుఈ ఆయిల్ ను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ రంధ్రాల నుంచి మురికి తొలగిపోయి మొటిమలు తగ్గుతాయి..
ఈ సుగంధ కోకిల ఆయల్ న్ని తలనొప్పి వచ్చినప్పుడు కొబ్బరి నూనెలో ఒక రెండు చుక్కలు వేసి కలిపి తలకు మసాజ్ చేసినట్లయితే తలనొప్పి నుంచి వెంటనే రిలీఫ్ పొందవచ్చు.. మంచి నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆయిల్ ని చేతికి అప్లై చేసుకుని ఆ చేతుల్ని ముక్కు దగ్గర పెట్టి పిలుస్తూ అలా పడుకుంటే ఇట్టే నిద్రలోకి జారుకుంటారు. అలాగే జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ ఆయిల్ ని నీటిలో వేసి మరిగించి దాని ఆవిరి పట్టినట్లయితే ఈ జలుబు దగ్గు నుంచి బయటపడవచ్చు. చాలామంది ఒత్తిడి తో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆయిల్ పీల్చినట్లయితే మానసికమైన ప్రశాంతత పొందుతారు. ఈ సుగంధ ఆయిల్ తో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి