Summer Tips : ఎండాకాలంలో వెల్లుల్లిని అతిగా తింటున్నారా… అయితే, మీరు డేంజర్ లో ఉన్నట్లే…?
ప్రధానాంశాలు:
Summer Tips : ఎండాకాలంలో వెల్లుల్లిని అతిగా తింటున్నారా... అయితే, మీరు డేంజర్ లో ఉన్నట్లే...?
Summer Tips : వేసవి కాలం వచ్చిందంటే, అధిక వేడితో శరీరం అతలాకుతలమవుతుంది. వెల్లుల్లిని తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎండాకాలంలో వెల్లుల్లిని అతిగా తింటే మాత్రం. కొన్ని ముప్పులు తప్పవు. వెల్లుల్లి గురించి చెప్పాలంటే, వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు,యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. గుండె సమస్యలు,అధిక రక్తపోటును, గించగలిగే లక్షణాలు ఈ వెల్లుల్లికి ఉంది. అలర్జీ వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. వెల్లుల్లి అందరి వంటగదిలో ఉండే దివ్య ఔషధం.ఇది తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. వంటలలో రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను కూడా ఇస్తుంది. సుగంధ ద్రవ్యం అని కూడా చెప్పవచ్చు.

Summer Tips : ఎండాకాలంలో వెల్లుల్లిని అతిగా తింటున్నారా… అయితే, మీరు డేంజర్ లో ఉన్నట్లే…?
లుల్లి తింటే మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. అవి, విటమిన్ A,B,C సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇనుము కార్బోహైడ్రేట్లు కొవ్వు ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. వెల్లుల్లి అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించగలదు. ఇది జలుబు, దగ్గు,నిమోనియా, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది,అధిక రక్తపోటును తగ్గిస్తుంది. యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తలనొప్పి, మతిమరుపు,వాంతులు తగ్గుతాయి. వెల్లుల్లి ముఖ్యంగా గుండె సమస్యలను నివారించ గలదు. కొత్త పోటు వారికి ఈ వెల్లుల్లి మంచిది. ఇంటి నొప్పికి కూడా సహాయపడుతుంది. పంటి నొప్పి ఉన్నప్పుడు, వెల్లుల్లి ముక్కను నలిపి ఉపయోగించవచ్చు. జీవక్రియను పెంచుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నియంత్రణలో ఉంచుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. షుగర్ వ్యాధిని అరికడుతుంది.
Summer Tips ఎండాకాలంలో వెల్లుల్లిని తినొచ్చా
ఎండాకాలంలో వెల్లుల్లిని తినొచ్చు. కానీ, కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే శరీరంలో అలర్జీ సమస్యలు వస్తాయి. దీనిలో అలిసిన్ పదార్థం ఎక్కువగా తీసుకుంటే కాలేయం దెబ్బ తినే ప్రమాదం ఉంది. కావునా, అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. వేసవిలో వెల్లుల్లి తినొచ్చా లేదా అనే సందేహం ఉన్నవారికి, వేసవిలో వెల్లుల్లి తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకుంటే మంచిది. కంటే వెల్లుల్లి శరీరంలో వేడిని పెంచే లక్షణాలు ఎక్కువే ఉంటాయి. వడ్డీ ఎండాకాలంలో అసలే వేడిగా ఉంటుంది, నీకు తోడు ఈ వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే మాత్రం శరీరంలో తీవ్రతకు ఉన్న వేడికి ఈ వేడికి ఎక్కువయ్యి ఆరోగ్య సమస్యలు,అలర్జీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తక్కువ మోతాదులో తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.