Dehydration : ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కు గురైతే… మీ కిడ్నీలు డేంజర్ లో పడట్లే… ఈ తప్పులు అస్సలు చేయొద్దు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dehydration : ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కు గురైతే… మీ కిడ్నీలు డేంజర్ లో పడట్లే… ఈ తప్పులు అస్సలు చేయొద్దు…?

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2025,12:00 pm

Dehydration : వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా శరీరం అధిక చెమటలతో తడిసిపోతుంది. ఈ చెమటల వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అప్పుడు వెంటనే మన శరీరం నీటిని కావాలని సిగ్నల్స్ ఇస్తుంది. నోరు ఎండిపోయినట్లు అనిపిస్తుంది. దాహం వేస్తుంది. ఏదైనా చల్లటిది తాగాలనిపిస్తుంది. ఇప్పుడు మన వెంటనే శరీరం డిహైడ్రేషన్కు గురైందని గుర్తించాలి. ఇంకా మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ కలర్ను బట్టి కూడా మన శరీరానికి నీరు అవసరమనేది తెలియజేస్తుంది. మన శరీరం వెంటనే డిహైడ్రేషన్కు గురైందని మనం గుర్తించవచ్చు. అప్పుడు వెంటనే మనకు కావాల్సిన నీటిని శరీరానికి అందించాలి. కొంతమంది బిజీ లైఫ్ లో ఎక్కువ పని చేస్తూ కూర్చుని పోయి వారు వాటర్ ని తాగడానికి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ రకమైన బిజీ షెడ్యూల్ లో, ఎయిర్ కండిషనింగ్ తో సహా చాలా విషయాలు నిర్జలీకరణానికి దారితీస్తాయి. వర్క్ లో పడిపోయి నీటిని తాగడం అశ్రద్ధ చేస్తే, ఇది క్రమంగా శరీర నిర్జలీకరణానికి దారితీస్తుంది.

Dehydration ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కు గురైతే మీ కిడ్నీలు డేంజర్ లో పడట్లే ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Dehydration : ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కు గురైతే… మీ కిడ్నీలు డేంజర్ లో పడట్లే… ఈ తప్పులు అస్సలు చేయొద్దు…?

తద్వారా ఆరోగ్యం దెబ్బ తినడమే కాక మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ శరీరం డిహైడ్రేషన్ అయిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది.. అని ఎలా నివారించాలి అనే విషయాల గురించి నిపుణులు తెలియజేస్తున్నారు.. వేసవిలో సాధారణంగా వచ్చే సమస్య డిహైడ్రేషన్. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది మలబద్ధకం, తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, నీరసం,అలసట, చర్మ ముడతలు పెరగడం వృద్ధాప్యం వంటి శారీరక లక్షణాలను కూడా దారితీస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు అది మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. దానిని మీరు ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. మూత్ర విసర్జన ఫ్రీక్వెన్సీ, మూత్ర ర*** ద్వారా సాధారణంగా డీహైడ్రేషన్ గురించి గుర్తించవచ్చు. తక్కువ నీటిని తాగితే మూత్రస్థాయిలో చాలా తక్కువగా ఉంటాయి. ఉత్తరం రంగు పసుపు రంగులోకి మారుతుంది. నేను బట్టి మీ శరీరం డిహైడ్రేషన్కు గురైందని కనుక్కోవచ్చు.

Dehydration  డిహైడ్రేషన్ వల్ల కలిగే సమస్యలు ఏమిటి

తరచూ శరీరం నిర్జలీకరణం చెంది అది ఒంట్లో నిశ్శబ్దంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. త్రి మూత్ర నామాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఒంట్లో నీటి శాతం తక్కువగా ఉంటే మూత్రపిండాలు ఓవర్ టైం గా పని చేస్తాయి. దీనివల్ల మలినాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఇది రక్త సరఫరాను కూడా తగ్గిస్తుంది. ఇది చివరికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) కి దారితీస్తుంది.

Dehydration  నిర్జలికరణాన్ని ఎలా నివారించాలి

ప్రతిరోజు కనీసం 8 పెద్ద గ్లాసుల నీళ్లు తాగాలి. దాహం వెయ్యకపోయినా సరే నీటిని తాగాలి. హైడ్రేటు పండ్లు, కూరగాయలు తినాలి. చక్కర పానీయాలను మానివేయాలి. టీ, కాఫీ, కార్బోనేటెడ్ పానీయాలు, ప్యాక్ చేసిన పండ్ల రసాల వినియోగాన్ని తగ్గించాలి. ఇంటి లోపల పని చేసేవారు లేదా ఏసీలు కూర్చునేవారు రోజుకి 6 నుంచి 8 గ్లాసులు నీరు తాగాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది