Super Food : రాగులే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి.. లాభాలు తెలిస్తే మతి పోవాల్సిందే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Super Food : రాగులే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి.. లాభాలు తెలిస్తే మతి పోవాల్సిందే…?

 Authored By ramu | The Telugu News | Updated on :30 January 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Super Food : రాగులే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి.. లాభాలు తెలిస్తే మతి పోవాల్సిందే...?

Super Food : ప్రస్తుతం రోజుల్లో రాగులను ఎక్కువగానే తీసుకుంటున్నారు. డయాబెటిస్ పేషెంట్లు అయితే రాగులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ రాగులలో పాల పదార్థాలతో పోలిస్తే రాగిలో క్యాల్షియం అధికంగానే ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతూ దృఢంగా మార్చుతాయి. రాగులతో చేసిన ఆహార పదార్థాన్ని తినడం వల్ల బోలు ఎముకలు లాంటి వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు మాత్రం రాగులు మంచి ఔషధం అని నిపుణులు చెబుతున్నారు.

Super Food రాగులే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి లాభాలు తెలిస్తే మతి పోవాల్సిందే

Super Food : రాగులే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి.. లాభాలు తెలిస్తే మతి పోవాల్సిందే…?

Super Food రాగులలో పోషక విలువలు

ఈ రాగులు తృణధాన్యాలలో ఒకటైనది. ఇది ఒక పేదవాడి ఆహారమని చెబుతారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. నాగులలో క్యాల్షియం, ఐరన్లతో పాటు బోలెడు పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రాగులలో అధికంగా ప్రోటీన్లు, బాస్వరం, క్యాల్షియం, ఐరన్ అధిక ఫైబర్లు ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుతూ, మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. క్యాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగే ఉండడం వల్ల ఇది భయంకరమైన అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది,అసంతృప్తి కొవ్వులను తక్కువ.

Super Food రాగులతో బరువు నియంత్రణ

అధిక బరువుతో బాధపడేవారు రాగులు చక్కటి ఆహారం. రాగులుని మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాగులలో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫిట్నెస్ కోసం కష్టపడేవారు మరియు ఉబ్బకాయ సమస్యలతో ఇబ్బంది పడేవారు, రాగులను క్రమం తప్పకుండా తీసుకుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అలాగే రాగి పిండిలో పుష్కలంగా మెగ్నీషియం,పొటాషియంలో ఉంటాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రాగులు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రాగుల్ని తరచూ తీసుకుంటే షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది. ముందు జాగ్రత్తగా షుగర్ రాకుండా ఉండాలంటే కూడా రాగుల్ని తినొచ్చు. కంటే రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. నాగుల్లో ఫైబర్ మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. దీంతోపాటు అరుగుదల సమస్యలు, మలబద్ధకం,కడుపుబ్బరం,గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది