Weight loss : మొలకెత్తిన మెంతులను తీసుకొండి… ఈజీగా బరువు తగ్గండి…?
Weight loss : శరీరంలో ఎక్కువ కొవ్వులు పోగొట్టుకోవడానికి మరియు స్లిమ్ గా ఉండడం కోసం ఎంతోమంది ఒక యుద్ధ చేస్తూ ఉంటారు. అయితే కొందరు స్లిమ్ గా ఉండేందుకు జిమ్ కి వెళ్తే మరికొందరు మాత్రం యోగా చేస్తారు. ఇంకొందరు అయితే ఇంట్లోనే కొన్ని కసరత్తులు చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది బయట ఆహారాన్ని మానేసి కఠినమైన డైట్ లో ఫాలో అవుతూ ఉంటారు. ఇలా బరువు తగ్గడానికి ఈ రకమైన టఫ్ ఫైట్ లు చేయడం వల్ల మానసిక అలసటతో కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీటికి బెస్ట్ మెంతులే…
మెంతులలో కెరోటి నాయిడ్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఈ పదార్థం తొందరగా బరువును తగ్గించడానికి ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. అయితే ప్రాసెస్ చేసేటటువంటి మెంతులను మార్కెట్లో కొనే బదులుగా ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు. దీనిని వేడి నీటిలో కలుపుకొని దీనిలో కొద్దిగా నిమ్మరసం మరియు తేనె కలుపుకొని తాగొచ్చు. అయితే ఈ పానీయం బరువు తగ్గటానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది… ఉదయాన్నే ముందుగా మీరు టీ తాగే అలవాటు ఉన్నవారు దీనికి బదులుగా మెంతి పొడిని కలుపుకొని తీసుకోవచ్చు. ఈ టీని రోజు తీసుకోవడం వలన జీర్ణక్రియ అనేది ఎంతో మెరుగుపడుతుంది.
అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. కానీ దీని చేదును తగ్గించడానికి దీనిలో చక్కెర కలుపుకోవడం అసలు మంచిది కాదు. దీనికి బదులుగా ఏలకులు లేక బెల్లం ని కలుపుకోవచ్చు. కానీ ఈ టీ ని పరిగడుపున మాత్రమే తీసుకోవాలి. అయితే ముందుగా మెంతు గింజలను తీసుకొని వాటిని ఒక గిన్నెలో పోసి వాటిపై ఒక తడి గుడ్డ కప్పాలి. ఇప్పుడు గుడ్డ అనేది ఎప్పుడు ఎండిపోకుండా జాగ్రత్తగా తడి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మెతి గింజలు అనేవి రెండు మూడు రోజుల్లోనే మొలకెత్తుతాయి. అయితే దీనిలో విటమిన్లు మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మొలకెత్తిన మెంతుకూర తింటే మీరు ఈజీగా బరువు తగ్గుతారు…