Indigestion Problem : అజీర్తి సమస్యలకు ముఖ్య కారణాలు ఇవే… వెంటనే మానేయండి…!!
Indigestion Problem : మన కడుపు ఆరోగ్యం అనేది బాగా లేకుంటే మన మూడ్ కూడా బాగోదు. అయితే జీర్ణకోశ రుగ్మతల కారణం చేత తరచుగా కడుపునొప్పి మరియు మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. దీని వలన ప్రతిరోజు గ్యాస్ బర్న్ సమస్య అనేది వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ గ్యాస్ అనేది గుండె మంటకు ముఖ్య కారణం చెడు ఆహారపు అలవాట్లు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా తీసుకోవడం వలన ఈ రకమైన లక్షణాలు కనిపించటం స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే నూనె, మసాలా, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలను అధికంగా తాగితే జీర్ణ రుగ్మత సమస్య అంత తేలిగ్గా వదిలిపెట్టదు. అయితే అజీర్ణ సమస్య అనేది రాకుండా ఉండాలి అంటే మీ ఆహారపు అలవాట్లను కచ్చితంగా మార్చుకోవాలి. కానీ ఎంతోమందికి ఇంట్లో తయారు చేసిన ఆహారం తిన్న తర్వాత కూడా జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కావున మీరు ఆహారంతో పాటుగా మీ జీవనశైలిని కూడా మార్చుకోవాలి. అయితే అజీర్తిని తగ్గించుకోవడానికి ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఫాలో అయితే కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది…
మధ్యాహ్నం తర్వాత ఫాస్ట్ ఫుడ్ తినకూడదు : మీరు చాలాసార్లు ఎంతో రుచికరమైన మరియు ఫాస్ట్ ఫుడ్ కనిపిస్తే వెంటనే తినకుండా ఉండలేరు. అది పిజ్జా అయినా సరే బిర్యానీ అయినా సరే వీటిని మధ్యాహ్నం భోజనంలో తినడం అస్సలు మంచిది కాదు. ఇలాంటి భారీ కొవ్వు పదార్థాలను రాత్రి మరియు మధ్యాహ్న టైం లో తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఈ అలవాటును గనుక మీరు మార్చుకున్నట్లయితే,మీరు సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు. అలాగే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది…
రోజు వాకింగ్ చేయాలి : బద్ధకంగా జీవించడం వలన జీర్ణ సమస్యలను ఏ మాత్రం తగ్గించలేము. కావున మధ్యాహ్నం అయిన మరియు రాత్రైనా సరే భోజనం చేసి పడుకోవటం అనేది మంచి అలవాటు కానే కాదు. దీనికి బదులుగా భోజనం తర్వాత 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా గనక మీరు చేస్తే ఎన్నో వ్యాధుల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది…
తగినంత నిద్ర : సరిపడా నిద్ర లేకపోతే గ్యాస్ మరియు గుండెల్లో మంట సమస్యలకు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక మధుమేహం మరియు స్థూలకాయం, డిప్రెషన్ లాంటి ప్రమాదాలు కూడా పెరుగుతాయి. అలాగే రాత్రి పూట కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర అనేది కచ్చితంగా ఉండాలి…