Turmeric Milk : కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు… పసుపు పాలు తాగకూడదు… ఎందుకంటే…??

 Authored By ramu | The Telugu News | Updated on :15 November 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Turmeric Milk : కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు... పసుపు పాలు తాగకూడదు... ఎందుకంటే...??

Turmeric Milk : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యంపై ఎంతో ఆసక్తి పెరుగుతుంది. దీనిలో భాగంగా చాలా మంది పసుపు పాలను తాగుతున్నారు. అయితే ఈ పసుపు పాలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పసుపు పాలను తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు బాగా ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలకు పసుపు పాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. అలాగే ఈ పసుపు పాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియాలు మరియు యాంటీ ఇన్ఫెక్షన్ లాంటి ఎన్నో గుణాలు దాగి ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే కొంతమంది పసుపు పాలను తాగితే కొన్ని సమస్యలు తప్పవు అని అంటున్నారు. అలాగే కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు పసుపు పాలు తాగకూడదు అని అంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

– జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు పసుపు పాలు తాగకూడదు అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమందిలో ఇవి గ్యాస్ మరియు ఉబ్బరం, కడుపునొప్పి, వికారం లేక తిమ్మిరి లాంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు..

– కొంతమందిలో వచ్చే చర్మ సంబధిత సమస్యలకు కూడా పసుపు పాలు కారణం అవుతాయి అని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమందిలో ఇది అలర్జీకి కారణం అవుతుంది అని అంటున్నారు. అలాగే మీ చర్మంపై ఇటువంటి లక్షణాలు గనుక కనిపిస్తే ఆ పాలను తాగటం వెంటనే మానేయాలి అని అంటున్నారు..

– మధుమేహం మరియు కిమోథేరపి వ్యాధులకు మందులు వాడే వారు కూడా పసుపు పాలకు దూరంగా ఉండాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే రక్తం పలచన చేసే మంత్రులు వాడే వారు కూడ పసుపు పాలు తాగకూడదు అని అంటున్నారు..

– పిత్తాశయ సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా పసుపు పాలను తాగకూడదు అని అంటున్నారు నిపుణులు. పసుపు అనేది పిత్త ఉత్పత్తిని పెంచుతుంది. కావున పిత్తాశయ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అని అంటున్నారు.

Turmeric Milk : కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు... పసుపు పాలు తాగకూడదు... ఎందుకంటే...??

Turmeric Milk : కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు… పసుపు పాలు తాగకూడదు… ఎందుకంటే…??

– పసుపు పాలను ఎక్కువగా తీసుకోవటం వలన మూత్ర పిండం లో రాళ్లు ఏర్పడి అవకాశం కూడా ఉంది అని అంటున్నారు నిపుణులు. అలాగే కంటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి పసుపు పాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి అని అంటున్నారు. కావున పసుపు పాలు తాగే వారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి