Turmeric Milk : ఈ సమస్య ఉన్నవారు పసుపు కలిపిన పాలు తాగితే ఇక అంతే…తస్మాత్ జాగ్రత్త…
ప్రధానాంశాలు:
Turmeric Milk : ఈ సమస్య ఉన్నవారు పసుపు కలిపిన పాలు తాగితే ఇక అంతే...తస్మాత్ జాగ్రత్త...
Turmeric Milk : పసుపు Turmeric ఆరోగ్యానికి మేలును కలిగిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకోసమే మనం ప్రతిరోజు వంటకాలలో పసుపుని ఉపయోగిస్తుంటాం. ఇక ఈ పసుపు ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకుల సైతం చెబుతుంటారు. ఈ క్రమంలోనే అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు పసుపుకు చాలా దూరంగా ఉండాలట. లేకపోతే చర్మానికి సంబంధించిన సమస్యలు మరియు కడుపునొప్పి వంటివి రావచ్చు. ఇక పసుపులో కర్కుమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవడం కోసం పసుపు కలిపిన పాలను తాగడం చాలా మంచిది. అంతేకాకుండా వీటివల్ల ప్రయోజనాలు తో పాటు దుష్ప్రభావాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి.
పసుపు కలిపిన పాల వలన ఉబ్బరం, వికారం, గ్యాస్ ,అతిసారం ,కడుపునొప్పి వంటి సమస్యలకు కారణం అవ్వవచ్చు. ఇక జీర్ణ సమస్యలు మరియు కడుపునొప్పి ఉన్నవారు ఈ పసుపు కలిపిన పాలను తాగడం వలన అనారోగ్యం తీవ్రమవుతుంది. దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలకు అలెర్జీ ప్రతి చర్యకు కారణం అవుతుంది. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ పాలను తీసుకోకుండా ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
అదేవిధంగా పసుపు పిత్రాశయ రాళ్ల సమస్యను తీవ్రతరం చేయగలదు. ఇలా పిత్రాశయ రాళ్లు ఉన్న వారికి మరింత సమస్యలను పెంచుతుంది. అంతేకాకుండా కాలేయ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలు ఈ పసుపు సప్లమెంటరీ కు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే పసుపు గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి.
ఒకవేళ పసుపు పాలను తీసుకోవాలి అనుకుంటే 450 mg కి తక్కువగా తీసుకోవాలి. లేదా అంతకంటే ఎక్కువ మోతాదులో ఉన్న కర్కుమిన్ తీసుకుంటే తలనొప్పి, మైకం వంటి లక్షణాలు కొందరిలో కనిపించడం జరుగుతుంది. అయితే పసుపు ఆరోగ్యానికి మంచిది. కానీ దానిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు పసుపు తీసుకోకపోవడం చాలా మంచిది.