Turmeric Milk : ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారు పసుపు పాలను పొరపాటున కూడా తాగకండి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Turmeric Milk : ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారు పసుపు పాలను పొరపాటున కూడా తాగకండి…??

Turmeric Milk : సాధారణ పాల కంటే కూడా పసుపు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే జలుబు మరియు దగ్గు లాంటి వ్యాధులకు పసుపు పాలు మంచిది అని ఎప్పుడు వైద్యులు చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది పసుపు పాలను తాగటం తమ దిన చర్యలో భాగంగా చేసుకుంటూ ఉన్నారు. ఇలా రోజుకు ఒక గ్లాసు పసుపు పాలు తాగితే మొత్తం ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అని అంటున్నారు. అయితే పసుపులో కర్కుమిన్ కంటెంట్ మన శరీరంలోని […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Turmeric Milk : ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారు పసుపు పాలను పొరపాటున కూడా తాగకండి...??

Turmeric Milk : సాధారణ పాల కంటే కూడా పసుపు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే జలుబు మరియు దగ్గు లాంటి వ్యాధులకు పసుపు పాలు మంచిది అని ఎప్పుడు వైద్యులు చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది పసుపు పాలను తాగటం తమ దిన చర్యలో భాగంగా చేసుకుంటూ ఉన్నారు. ఇలా రోజుకు ఒక గ్లాసు పసుపు పాలు తాగితే మొత్తం ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అని అంటున్నారు. అయితే పసుపులో కర్కుమిన్ కంటెంట్ మన శరీరంలోని రోగనిరోధక శక్తి ని ఎంతో బలంగా చేస్తుంది. కావున సీజన్ మారుతున్నప్పుడు అనగా వేసవి నుండి వర్షాకాలం మరియు వర్షాకాలం నుండి శీతాకాలం మారుతున్నప్పుడు పసుపు పాలను తాగడం వలన జలుబు మరియు దగ్గు, కాఫం,జ్వరం లాంటి సమస్యల నుండి ఉపసమణం పొందవచ్చు అని అంటున్నారు. అయితే పసుపు కలిపిన పాలు ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు కీడు కూడా చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపు పాలు తాగటం అంత మంచిది కాదు అని అంటున్నారు. అయితే ఈ పాలను ఎవరు తాగకూడదు.?ఎందుకు.? ఇలాంటి విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

– పసుపు పాలు ఆరోగ్యానికి వరం అయినప్పటికీ కూడా వీటిని అధికంగా తాగటం వలన కొందరి ఆరోగ్యంపై సానుకుల ప్రభావం కన్నా ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు..

– గ్యాస్ లేక కడుపు ఉబ్బరం లాంటి కడుపుకు సంబంధించిన సమస్యలు తో ఇబ్బంది పడేవారు కూడా పసుపు పాలు తాగటం అంత మంచిది కాదు. ఎందుకు అంటే దీనిలో పదార్థాలు సమస్యలను ఎక్కువ చేస్తాయి..

– మధుమేహం లాంటి సైలెంట్ కిల్లర్ సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా పసుపు పాలను తాగకూడదు అని వైద్యులు చెబుతున్నారు..

– తరచుగా తక్కువ రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా పసుపు పాలు హాని చేస్తాయి. ఎందుకు అంటే ఇది రక్తపోటును ఎక్కువ తగ్గిస్తుంది..

– కొందరికి పాలతో కూడా అలర్జీ అనేది ఉంటుంది. ఇలాంటి వారు కూడా పసుపు పాలు తాగటం అంత మంచిది కాదు..

Turmeric Milk ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారు పసుపు పాలను పొరపాటున కూడా తాగకండి

Turmeric Milk : ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారు పసుపు పాలను పొరపాటున కూడా తాగకండి…??

– వర్షాకాలంలో లేక చలికాలంలో పసుపు పాలు ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఆయుర్వేద ప్రకారం చూస్తే పసుపు పాలను పరిమితి మోతాదులో తీసుకుంటేనే మంచిది. అప్పుడే ఆరోగ్యానికి మంచి ప్రయోజనం ఉంటుంది. ఇలా ఏదైనా సరే పరిమితికి మించి తీసుకోవటం వలన ఆరోగ్యం పై చెడు ప్రభావం అనేది పడుతుంది అని అంటున్నారు…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది