Afternoon Sleeping : మధ్యాహ్నం సమయంలో నిద్ర వల్ల ఎన్నో ప్రయోజనాలు… ఇది తెలిస్తే.. రాత్రి సమయం అస్సలు నిద్రపోరు…
ప్రధానాంశాలు:
Afternoon Sleeping : మధ్యాహ్నం సమయంలో నిద్ర వల్ల ఎన్నో ప్రయోజనాలు... ఇది తెలిస్తే.. రాత్రి సమయం అస్సలు నిద్రపోరు...
Afternoon Sleeping : మన పూర్వికుల నుంచి నేటి వరకు పెద్దలు, మధ్యాహ్నం సమయంలో నిద్రించడం అంత మంచిది కాదని చెబుతూ ఉంటారు. అసలు నిద్ర అనేది మనుషులకి ఎంతో ముఖ్యం. ఇది శరీరానికి విశ్రాంతిని, మానసిక ఆరోగ్యాన్ని, మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిద్ర బాగా పోతే మెదడు పునర్జీవనం అందుతుంది. జ్ఞాపకశక్తి,ఏకాగ్రత, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చాలామందికి కూడా పగటిపూట నిద్రించే అలవాటు ఉంటుంది. కానీ దీనిని, మంచిది కాదని చెబుతుంటారు. అయితే, ఆరోగ్యాన్ని పనులు మాత్రం పగటిపూట నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…

Afternoon Sleeping : మధ్యాహ్నం సమయంలో నిద్ర వల్ల ఎన్నో ప్రయోజనాలు… ఇది తెలిస్తే.. రాత్రి సమయం అస్సలు నిద్రపోరు…
Afternoon Sleeping పగటి నిద్ర ఆరోగ్య ప్రయోజనాలు
మన మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది. పగటిపూట కొద్దిసేపైనా నిద్రిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పగటిపూట నిద్రపోతే రక్తపోటు కూడా నివారించవచ్చు. ఇప్పుడు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. మధ్యాహ్నం కాసేపు నిద్రపోతే, శరీరం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం జీన సమస్యలు కూడా నివారించ బడతాయి.
పగటి పూట నిద్రిస్తే నష్టాలు : మధ్యాహ్న సమయంలో ఎక్కువసేపు నిద్రిస్తే, రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవచ్చు. మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే మానసిక సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి. పగటిపూట నిద్రిస్తే పనిపై శ్రద్ధ తగ్గుతుంది. బద్ధకం పెరుగుతుంది. షుగర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ఎంతసేపు నిద్రించాలి: మధ్యాహ్నం, 20-30 నిమిషాలు నిద్రపోతే మంచిది. ఇంతకంటే ఎక్కువసేపు నిద్రిస్తే రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుంది.
ఏ సమయంలో నిద్రించాలి : మధ్యాహ్నం,1-3 గంటల మధ్య నిద్ర పోతే మంచిది.
ఎవరు నిద్రపోకూడదు:
.రాత్రి సమయంలో నిద్రలేని సమస్య ఉన్నవారు.
. రాత్రి సమయంలో షిఫ్ట్లలో పనిచేసే వారు.
. నిద్ర లేని సమస్యతో బాధపడుతున్న వారు.