Afternoon Sleeping : పగటిపూట నిద్రపోతున్నారా..? అయితే ఇక ప్రమాదంలో పడినట్లే…!
ప్రధానాంశాలు:
Afternoon Sleeping : పగటిపూట నిద్రపోతున్నారా..? అయితే ఇక ప్రమాదంలో పడినట్లే...!
Afternoon Sleeping : నిద్ర అనేది ఎంతో అవసరం. నిద్ర లేని సమస్యతో ఇబ్బంది పడే వారికి ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సరియైన నిద్ర లేకపోతే వారికి డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు ఇంకా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే సరియైన నిద్ర నిద్రించకపోయిన ఇబ్బందే.. నిద్ర అధికంగా నిద్రపోయిన ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. చాలామంది మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతూ ఉంటారు.. కొంతమందికి అది జీవితంలో ఒక భాగంగా మారిపోతూ ఉంటుంది.
మధ్యాహ్నం భోజనం తర్వాత కచ్చితంగా పడుకుంటుంటారు. అయితే ఈ మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం ప్రమాదం తప్పదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్లు ఆరోగ్యాన్ని కూడా డేంజరే నట. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది రాత్రి పూట నిద్రకు భంగం కలిగిస్తుంది.మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల స్ట్రోక్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఆడవారు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు పని చేసి చేసి అలసిపోయి భోజనం చేసి అలా పడుకుంటూ ఉంటారు. భోజనం చేయగానే అలసిపోయి ఉన్న ఉన్న శరీరం విశ్రాంతి కావాలంటుంది. దాంతో ఆటోమేటిక్గా కొందరు నిద్రపోతూ ఉంటారు.
ఒకవేళ ఆ అలవాటు మర్చిపోలేక పోతే ఓ 30 నిమిషాల పాటు నిద్రపోయి తర్వాత మేలుకోవాలి అని నిపుణులు చెప్తున్నారు. అంతేగాని మితిమీర నిద్రపోతే ఎన్నో వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25% ఆటంకాలు ఎక్కువ. రాత్రి సమయంలో నిద్రను కోల్పోయే రూపనగ కూడా గుర్తించవచ్చు. రాత్రి సరియైన నిద్ర లేకపోతే అధిక రక్తపోటు ,డయాబెటిస్ గుండె జబ్బులు, ఊబకాయం, ఆందోళన లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే చిన్నపిల్లలు , వృద్ధులు అనారోగ్యంగా ఉన్నవారు మాత్రం పగలు గరిష్టంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చు. మిగిలిన వారు గరిష్టంగా 10 నిమిషాల నుంచి అరగంటలోపు మాత్రమే పడుకోవాలి అంటున్నారు నిపుణులు.