Health Benefits : చెరుకు రసంతో ఎన్నో ప్రయోజనాలు.. అయితే ఇలా మాత్రం తాగకండి
Health Benefits : సమ్మర్ లో ఎండలు ఎక్కువగా ఉండటంతో తరచుగా దాహం వేస్తుంది. బాడీ తొందరగా డీహైడ్రేషన్ కి గురవుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో పండ్ల రసాలు, కొబ్బరి నీరు, ఎక్కువగా నీరును తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. ఇలా శరీరానికి తగిన నీటి శాతాన్ని అందించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. కొబ్బరి నీరు, చెరుకు రసం వంటి పానీయాలతో శరీరంలోని వేడిమి తగ్గిపోతుంది. చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి.ప్రపంచంలోనే చెరకు ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారతదేశం ఉంటుంది. చెరకు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పండుతుంది. చెరుకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి.
250 కేలరీలు, 30 గ్రాముల సహజ చక్కెరను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన అత్యంత పోషకమైన డ్రింక్ అని నిపుణులు చెబుతారు.చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అధిక వేడితో అలసిపోయినా శరీరంలో నీటి కొరత ఉన్నట్లు అనిపించినా చెరకు రసం తీసుకుంటే మంచి ఉపషమనం లభిస్తుంది. చెరకు రసం కామెర్లు చికిత్సలో ఉపయోగిస్తారు. చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. కాలేయంలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది ఎల్లో ఫీవర్‌ను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.చెరకు రసం కిడ్నీలను శుభ్రపరుస్తుంది చెరకు రసం కిడ్నీలను శుభ్రపరుస్తుంది. సహజంగా ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, సంతృప్త కొవ్వులతో పాటు ఆహారంలో తక్కువ సోడియం సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
Health Benefits : వెంటనే శక్తినిస్తుంది…
చెరకు రసం క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చెరకు ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటాయి. ఈ గొప్ప వనరుల సహాయంతో శరీరం క్యాన్సర్ కణాలతో పోరాడడంలో సహాయపడుతుంది.చెరకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి రలీఫ్ ఉంటది. ప్రత్యేకంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించేవారు చెరుకు రసం తాగడం వల్ల ఉపషమనం లభిస్తుంది. అంతే కాకుండా చెరుకు రసం కిడ్నీ స్టోన్స్ ను కూడా తగ్గిస్తుంది. చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది. చెరకు రసం కూడా నోటి దుర్వాసన సమస్యను కంట్రోల్ చేస్తుంది.అలాగే చెరకు రసంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కడుపులో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు చెరకు రసాన్ని తీసుకుంటే చక్కటి పరిష్కారం అభిస్తుంది.