Health Benefits : కాకరకాయ టీతో ఇన్ని లాభాలా… తెలిస్తే అవాక్కవాల్సిందే…
Health Benefits : కాకరకాయ తినడానికి చేదుగా ఉన్న ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. వీటి వలన ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యల నుండి డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. డయాబెటిస్ సమస్యల నుండి బయటపడటానికి కాకరకాయ ఎంతగానో మేలు చేస్తుంది. కానీ కాకరకాయని అంతగా ఎవరు ఇష్టపడరు. దీనిలో ఉండే చేదు కారణంగా కాకరకాయను చాలామంది తినేందుకు ఇష్టపడరు.
కాకరకాయ తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవి తెలిసినా కూడా మనం కాకరకాయను ఇష్టపడం అలాంటి వారి కోసమే ఇప్పుడు కాకరకాయ టీ వచ్చింది. కాకరకాయల కూర తినలేని వారికి ఇదొక ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. కాకరకాయల టీ ని తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. క్యాన్సర్ ని సైతం దూరం చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ కాకరకాయ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కాకరకాయలను ముక్కలుగా చేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండిన మొక్కలను నీళ్లల్లో వేసి ఓ పావుగంట దాకా మరిగించాలి. ఆ తర్వాత కాకరకాయ రసాన్ని వేరుచేసి దానికి తేనే, నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత త్రాగాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని ప్రతిరోజు త్రాగితే సమస్య తగ్గుతుంది. డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అధిక బరువుతో ఉన్నవారు సన్నబడతారు. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇంకా కాకరకాయ టీ క్యాన్సర్ కణాలు పెరగుదలను అడ్డుకుంటుంది. అందువలన రోజు ఈ నీరు త్రాగితే క్యాన్సర్ జబ్బును ముందే అరికట్టవచ్చు. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వలన మరి ఏ అనారోగ్యాలు దరిచేరవు.