Thyroid : ఈ 3 టిప్స్ తో థైరాయిడ్ కి చెక్ పెట్టండి ఇలా…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Thyroid : ఈ 3 టిప్స్ తో థైరాయిడ్ కి చెక్ పెట్టండి ఇలా…!

Thyroid : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారమే సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం చాలామంది బాధపడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. చాలా చిన్న వయసులోనే చాలామంది థైరాయిడ్ సమస్య బారిన పడుతున్నారు. థైరాయిడ్ అనేది ముఖ్యంగా జీవ క్రియపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. అయితే […]

 Authored By anusha | The Telugu News | Updated on :23 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Thyroid : ఈ 3 టిప్స్ తో థైరాయిడ్ కి చెక్ పెట్టండి ఇలా...!

  •  మన ఆరోగ్యం మన చేతుల్లోనే

Thyroid : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారమే సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం చాలామంది బాధపడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. చాలా చిన్న వయసులోనే చాలామంది థైరాయిడ్ సమస్య బారిన పడుతున్నారు. థైరాయిడ్ అనేది ముఖ్యంగా జీవ క్రియపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. అయితే తీసుకునే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే థైరాయిడ్ ను అదుపులోకి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

1) థైరాయిడ్ నియంత్రించడంలో కొబ్బరి ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొబ్బరి తో తయారు చేసిన ఆహార పదార్థాలను థైరాయిడ్ తో బాధపడే వారికి మంచి ఆహారమని చెప్పవచ్చు. కొబ్బరిని తీసుకోవడం వలన థైరాయిడ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఇది జీవక్రియకు బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక స్పూన్ కొబ్బరి తీసుకుంటే థైరాయిడ్ తగ్గించవచ్చు. అంతేకాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

2) గుమ్మడికాయ గింజలు కూడా థైరాయిడ్ నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుమ్మడికాయ గింజల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని లభ్యమవుతాయి. ఈ గింజల్లో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ లు, ఖనిజాలు వంటి పోషకాలను గ్రహించడానికి జింకు బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా గుమ్మడికాయ గింజల్ని ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వలన థైరాయిడ్ లెవెల్స్ అనేవి అదుపులో ఉంటాయి.

3) ఉసిరికాయ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉసిరికాయలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఉసిరికాయ రసం త్రాగినా, ఉసిరిని ఆహారంలో చేర్చుకున్న చాలా మంచిది. ఇది కేవలం థైరాయిడ్ సమస్యనే కాదు. ఇతర అనారోగ్య సమస్యలను కూడా దరిచేరకుండా చేస్తుంది. నారింజ కంటే ఉసిరిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శరీరాన్ని చాలా బలంగా మార్చుతుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది