Pomegranate : ఆరోగ్యానికి అద్భుతమైన వరం.. దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pomegranate : ఆరోగ్యానికి అద్భుతమైన వరం.. దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Pomegranate : ఆరోగ్యానికి అద్భుతమైన వరం.. దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే...!

Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పండులో ఉన్న పుష్కలమైన పోషకాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలపై చెక్ వేసే శక్తి దానిలో ఉంది. దానిమ్మలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయి. అవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాల్లో అవరోధాలను తొలగించడంలో సహాయపడతాయి.

Pomegranate ఆరోగ్యానికి అద్భుతమైన వరం దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే

Pomegranate : ఆరోగ్యానికి అద్భుతమైన వరం.. దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే…!

Pomegranate : ఇవి లాభాలు..

పాలీఫెనాల్స్ మెదడులో న్యూరాన్ కణాలను రక్షించడంలో కీలకంగా పనిచేస్తాయి. జ్ఞాపకశక్తి మెరుగుపడటమే కాకుండా, వయసుతో వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో దానిమ్మ సాయపడుతుంది. దానిమ్మలో ఉండే ప్రత్యేకమైన ఎంజైమ్‌లు కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ మరియు రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో దానిమ్మ తినడం ఉపయోగకరమని వైద్యులు పేర్కొంటున్నారు.

ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు జీర్ణాన్ని మెరుగుపరచడం, మలబద్ధకం నివారణ వంటి సమస్యలపై మంచి ఫలితాలు చూపుతుంది. కడుపు సంబంధిత ఆరోగ్యానికి ఇది ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారికి ఇది ఒక సహజ మార్గం. దీనివల్ల బలహీనత, అలసట వంటి లక్షణాలు తగ్గుతాయి. దానిమ్మలో ఉండే విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు, చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడమే కాకుండా, యవ్వనాన్ని నిలుపుకుంటూ, ముడతలు, వృద్ధాప్య లక్షణాలు తగ్గించే శక్తి కలిగి ఉంటాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది