Heart Attack : గుండెపోటు వచ్చే ముందు శరీరంలో కనబడే ముఖ్య లక్షణాలు ఇవే…!!
ప్రధానాంశాలు:
Heart Attack : గుండెపోటు వచ్చే ముందు శరీరంలో కనబడే ముఖ్య లక్షణాలు ఇవే...!!
Heart Attack : ప్రస్తుతం మారుతున్న జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్ల కారణం వలన ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు సమస్యలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఎంతోమంది ఛాతి నొప్పిని గుండెపోటు ముఖ్య లక్షణంగా భావిస్తూ ఉన్నారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. అయితే ఈ గుండెపోటుకు ముందు మన శరీర భాగాలు ఎన్నో రకాల సంకేతాలను మనకు పంపుతాయి. అలాగే గుండెపోటు వచ్చే ముందు మన శరీరంలో ఇతర భాగాలలో ఈ కింద లక్షణాలు మొదలవుతాయి అని అంటున్నారు నిపుణులు. అయితే అహ్మదాబాద్ కు చెందిన డాక్టర్ ఆకాష్ షా మాట్లాడుతూ, ఛాతిలో కాకుండా శరీరంలో ఎక్కడ గుండెపోటు నొప్పి వస్తుందో తెలిపారు. అయితే ఛాతిలో మాత్రమే కాకుండా మెడ మరియు దవడ భుజం లో కూడా నొప్పి అనేది వస్తుంది…
భుజం బ్లేడ్ల మధ్య అనేది తరచుగా గుండెపోటు వ్యాధిగ్రస్తులలో వస్తుంది. ఇవి మహిళల్లో సర్వసాధారణం అని చెప్పొచ్చు. కానీ ఈ రకమైన నొప్పులను కండరాల తిమ్మిరి లేక అలసట వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే తరచుగా అజీర్ణం సమస్య సంభవిస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే ఎగువ పొత్తి కడుపు నొప్పి కూడా గుండెపోటు లక్షణాలలో ఒకటి అని చెప్పొచ్చు…
ఈ లక్షణాలు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వికారం, అలసట, వాంతులతో కలిపి ఉన్నట్లయితే, మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే మీ ఎడమ చేతిలో ఎక్కువ నొప్పి ఉన్నట్లయితే,ఇది కూడా గుండెపోటు కు లక్షణం కావచ్చు. అయితే కొన్ని సందర్భాలలో ఈ నొప్పి అనేది రెండు చేతులకు కూడా సంభవిస్తుంది. ఇది గనక జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించండి…