Skin Whitening Drinks : ఈ పానీయంతో మీ చర్మం మరింత అందంగా పెరగడం ఖాయం.. ఒకసారి ట్రై చేయండి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Skin Whitening Drinks : ఈ పానీయంతో మీ చర్మం మరింత అందంగా పెరగడం ఖాయం.. ఒకసారి ట్రై చేయండి..!!

 Authored By aruna | The Telugu News | Updated on :6 January 2024,7:00 am

Skin Whitening Drinks : చర్మం అందంగా ఉండడానికి కేవలం ఫేషియల్స్ రాసుకుంటే సరిపోదు. లోపలి నుంచి కూడా పోషణ అందించాలి. అప్పుడే చర్మం మరింత అందంగా ఉంటుంది. చర్మం బాగుండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ఎక్కువ నూనె వాడకూడదు. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. చాలామంది క్రమం తప్పకుండా ముఖానికి సబ్బు రాసి, స్క్రబ్ చేసి, క్రీమ్ రాసుకుంటూ జాగ్రత్త పడుతుంటారు. ఎంత చేసినా రంగు మారదు కానీ రోజువారి అలవాట్లు కొద్దిగా మార్చుకుంటే చర్మం రంగు మరింతగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. లోపల నుంచి డీటాక్స్ఫికేషన్ బాగుంటే ముఖంపై మొటిమల సమస్య కూడా ఉండదు. చర్మ సమస్యలకు హార్మోన్స్ కూడా కారణం అవుతాయి.

హార్మోను సరిగ్గా పని చేయాలంటే కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఒకటిన్నర కప్పు నీటిలో దాల్చిన చెక్క పొడి, అర స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మెంతి వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు దీనిని ఒక గ్లాసులో వడకట్టుకొని ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన శరీరంలోని అన్ని హార్మోన్స్ సక్రమంగా పనిచేస్తాయి. పైగా పొట్ట కూడా శుభ్రం అవుతుంది. చర్మం కూడా మెరుస్తుంది. చర్మ నిర్మాణంలో కొల్లాజెన్ సహాయపడుతుంది. దాల్చిన చెక్క పెన్నేల్ కొల్లాజిన్ ఏర్పడడానికి సహాయపడే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది.

వీటివల్ల చర్మం త్వరగా వృద్ధాప్యం చెందదు. చర్మం బిగుతుగా ఉంటుంది. అన్ని వయసుల వారు ఈ పానీయం త్రాగవచ్చు. ఈ పానీయం త్రాగటం వలన వయస్సు తో పాటు వస్తున్న చర్మం ముడతలు నల్లగా మారడాన్ని ఇది నివారిస్తుంది. ఆక్సీకరణం ఎక్కువగా ఉండటం వలన చర్మం తాజాగా ఉంటుంది. అందుకే ఈ పానీయం చర్మం రంగు మరింత పెరగటానికి సహాయపడుతుంది. ఈ పానీయాన్ని అన్ని వయసుల వారు త్రాగవచ్చు చర్మంపై ముడతలు రాకుండా ఈ పానీయం సహాయపడుతుంది అలాగే చర్మం రంగు మరింతగా పెరుగుతుంది. ముఖానికి వివిధ రకాల క్రీమ్స్ ను రాసుకునే బదులు ఈ పానీ అని కనుక తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ పానీయం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని వయసుల వారు ఈ పానీయాన్ని త్రాగవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది