Fruits for Cholesterol : ఈ పండ్లతో కొవ్వు కరగడం ఖాయం.. ఇప్పుడే తెలుసుకోండి…!!
Fruits for Cholesterol : అధిక కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది మెల్లగా మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కచ్చితంగా మందులు వాడాలి. వీటితోపాటు అధిక కొవ్వు ఉన్న పదార్థాలు మరియు క్యాలరీలకు సంబంధించిన ఆహారం తీసుకోకూడదు. అలాంటివారు పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం మరియు ఆహారంలో ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ఈ వేసవిలో ధాన్యాలు తినడంతో పాటు కొన్ని పండ్లను కూడా ఆహారంలో తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వు కొద్ది రోజుల్లోనే కరిగిపోతుందట. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మామిడి పండ్లు…
వేసవికాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడిపండు ఒకటి. ఈ మామిడి పండును తినడం వలన శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు. అయితే మామిడి పండులో చాలా ఉపయోగకరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ వంటివి ఇందులో అధికంగా ఉంటాయి. వీటి ద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే మామిడిపండ్లలో ఫైబర్ అధికంగా ఉండడం వలన ఇది జీర్ణ ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుస్తుంది.
అరటిపండు…
వేసవి కాలంలో అరటిపండును ప్రతిరోజు తినడం వలన రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే అరటి పండ్లు , యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులు వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బొప్పాయి పండు.
పండిన బొప్పాయిలో పపైన్ అనే సమేళనం ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. వాటితోపాటు శరీరంలో అధిక కొలెస్ట్రాలను తగ్గించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే పండిన బొప్పాయిలో ఫైబర్ విటమిన్లు మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.దీని ద్వారా ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎండు ద్రాక్ష…
ఎండు ద్రాక్షలో ఫ్యూనికాలాజిన్ మరియు పాలి ఫైనల్స్ అనే సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. వీటి ద్వారా ఎల్.డి.ఎల్ అనే కొలెస్ట్రాలను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్ష గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఆపిల్స్…
కొలెస్ట్రాలను తగ్గించడంలో ఉత్తమమైన పండు అంటే ఆపిల్ అని చెప్పాలి .అయితే ఈ ఆపిల్ పండులో కరిగే ఫైబర్ , ఫెస్టిన్ ఉంటుంది. ఇక ఇది ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ సాయిని తగ్గించడం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితోపాటు దీనిలో ఆంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
ద్రాక్ష…
వేసవికాలంలో ద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వలన ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ సాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలోని వాపులను కూడా ఇది తగ్గిస్తుంది.