Heart Attack : చలికాలంలో గుండె నొప్పి, స్ట్రోక్స్ రావడానికి ఇదే ముఖ్య కారణం…!!
Heart Attack : చాలా మందికి గుండె నొప్పి వచ్చి కొప్పకూలిపోయి చనిపోతూ ఉంటారు.. ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అయితే చలికాలంలో స్ట్రోక్ రావడానికి ఇదే ముఖ్య కారణమట.. నిత్యం స్నానం చేస్తూ ఉంటాం.. స్నానం చేసేటప్పుడు కొందరు చన్నీటితో స్నానం చేస్తే ఇంకొందరు గోరువెచ్చని నీటితో ఇంకొందరు వేడి నీటితో చేస్తూ ఉంటారు. సహజంగా చలి అధికంగానే ఉంది. ఈ టైంలో మధ్య వయసులో ఉన్న వాళ్ళు చల్లని నీటితో స్నానం చేయవచ్చు. దీనివలన ఎటువంటి నష్టం కలగదు.. కానీ వృద్దులు మాత్రం చన్నీటి కంటే వేడి నీటితోనే స్నానం చేయడం చాలా మంచిది. అని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఎందుకనగా పెరిగిన చలికి చన్నీటి స్నానం అంటే వారికి మరింత చలి పెరిగి లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.. చన్నీటి స్నానం చేయడం వలన ఉపయోగాలు : చన్నీటి స్నానాలు చేయడం వలన శరీరంలో బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. రక్తాన్ని మీ అవయవాలకు చేరేలా చేస్తూ ఉంటాయి.
దీంతో మీరు వెచ్చగా ఉండడానికి ఉపయోగపడుతుంది. వేడినీటితో స్నానం చేసినప్పుడు రక్తం చర్మం ఉపరితలం వైపు కదులుతూ ఉంటుంది. చల్లని వీటితో స్నానం రక్తం సరఫరా బాగా జరుగుతుంది. బలంగా ఉండేలా చేస్తాయి. అలాగే రక్తపోటు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ టైంలో అస్సలు వద్దు : వైద్యుని పిల్ల ప్రకారం చలికాలంలో ఆరోగ్యం బాగా లేనప్పుడు చన్నీటి స్నానం అసలు చేయవద్దు.. ఎందుకనగా ఇది మీ శరీరం వేడెక్కే సమయాన్ని అధికమయ్యేలా చేస్తుంది. ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. దాంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే చన్నీటి స్నానాలు చేయవద్దు. ఈ కారణంగా దగ్గు, జలుబు నిమేనియా, గొంతులో చికాకు జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఐబీపీ గుండె జబ్బులు ఉన్నవాళ్లు కూడా చెన్నైటి స్నానానికి దూరంగా ఉండాలి.. కొన్ని జాగ్రత్తలు
: షుగర్ ఆహారం తీసుకోవడం వలన బాడీలో కొలెస్ట్రాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్పెరుగుతాయి..రోజు వ్యాయామం బాడీని వెచ్చగా చురుగ్గా ఉంచుతుంది. కావున రోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలాగే ఎరోబిక్స్ ,యోగ, రన్నింగ్ లాంటివి చాలా మంచిది. స్నానం చేసేటప్పుడు ముందుగానే తలపై నీరు పోసుకోవద్దు. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతూ ఉంటుంది. ముందుగా శరీరంపై తర్వాత తలపై నీటిని పోస్తూ ఉండాలి.. స్నానం చేసేందుకు గోరువేచ్చని నీరు చాలా మంచిది.. చలికాలంలో దొరికే సీజనల్ కూరగాయలు, పండ్లు తీసుకోవడం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది..చలికాలంలో స్ట్రోక్స్: చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్స్ పెరుగుతాయి. ఎందుకనగా చలి సమయంలో మన రక్తం మందంగా మారుతూ ఉంటుంది. రక్తనాళాలు సాధారణంగా ఇరుగ్గా ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచేలా చేస్తాయి. రక్తనాళాలు చీలిపోయి మెదడులో రక్తస్రావం పెరుగుతుంది. దీని కారణంగా స్ట్రోక్ వచ్చి ప్రాణాంతకంగా మారొచ్చు…