Soyabeans : సోయాబీన్స్ ను మీ ఆహారంలో చేర్చుకుంటే చాలు… బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Soyabeans : సోయాబీన్స్ ను మీ ఆహారంలో చేర్చుకుంటే చాలు… బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు…!!

Soyabeans : ప్రస్తుత కాలంలో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే బరువును తగ్గించేందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు తరచూ చెబుతూ ఉంటారు. అయితే నాన్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా గుడ్లు మరియు మాంసం నుండి కూడా ఈజీగా ప్రోటీన్ లు మీరు పొందవచ్చు. ఒకవేళ మీరు శాఖాహారులు అయితే తగినంత శాఖాహార ప్రోటీన్ తీసుకోవటం చాలా అవసరం. మీరు బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తుంటే అప్పుడు మీ ఆహారంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 September 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Soyabeans : సోయాబీన్స్ ను మీ ఆహారంలో చేర్చుకుంటే చాలు... బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు...!!

Soyabeans : ప్రస్తుత కాలంలో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే బరువును తగ్గించేందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు తరచూ చెబుతూ ఉంటారు. అయితే నాన్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా గుడ్లు మరియు మాంసం నుండి కూడా ఈజీగా ప్రోటీన్ లు మీరు పొందవచ్చు. ఒకవేళ మీరు శాఖాహారులు అయితే తగినంత శాఖాహార ప్రోటీన్ తీసుకోవటం చాలా అవసరం. మీరు బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తుంటే అప్పుడు మీ ఆహారంలో తగిన మోతాదులో ప్రోటీన్ లను చేర్చుకోవడం చాలా అవసరం. అయితే అధిక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలలో సోయాబీన్స్ కూడా ఒకటి. అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఈ సోయాబీన్స్ ను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే ఇది మీ శరీరానికి సరైన ఎదుగుదలకు అవసరమైనటువంటి 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాకా సోయాబీన్స్ అనేవి బరువును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. సోయాబీస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం…

అధిక ప్రోటీన్ కంటెంట్ : సోయాబీన్స్ అనేవి ప్రోటీన్ లకు ముఖ్య మూలం అని చెప్పొచ్చు. ఇవి మొత్తం కేలరీలను తీసుకోవటం మరియు తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. దీంతో మీకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు…

అతిగా తినడాన్ని నివారిస్తుంది : ఈ సోయాబీన్స్ లో ఉండే ప్రోటీన్ అనేవి కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. ఇది తరచుగా అల్పాహారం మరియు అతిగా ఆహారాన్ని తీసుకోకుండా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది…

సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది : సోయాబీన్స్ లో సంతృప్తి కొవ్వులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మీ శరీరంలో కొవ్వు పెరుగుతుంది అనే భయం లేకుండా వీటిని తినొచ్చు.

Soyabeans సోయాబీన్స్ ను మీ ఆహారంలో చేర్చుకుంటే చాలు బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు

Soyabeans : సోయాబీన్స్ ను మీ ఆహారంలో చేర్చుకుంటే చాలు… బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు…!!

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది : సోయాబీన్స్ లో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఫైబర్ అనేది జీర్ణ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. అంతేకాక మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది…

పోషకాలు అధికం : సోయాబీన్స్ లో విటమిన్లు మరియు ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ అవసరమైన ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాని కి మద్దతు ఇచ్చే ఇతర రకాల పోషకాలను కూడా ఇస్తాయి.

తక్కువ కేలరీలు తీసుకోవడం : ఈ సోయాబీన్స్ ను మీ ఆహారంలో చేర్చుకోవడం వలన మీరు తక్కువ పోషకాలు మరియు కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఇది మొత్తం కేలరీలను తీసుకోవడంలో మరియు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే బరువు తగ్గటంలో కూడా హెల్ప్ చేస్తుంది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది