Beer | బీరు తాగిన వారిని ఎక్కువగా దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
Beer | దోమలు కొంతమంది మనుషులను ఎక్కువగా కుడుతుంటాయి. వారిని చూస్తే “వాళ్ల రక్తం మిఠాయిలా ఉండి ఉంటుందేమో!” అనే కామెంట్లు వినిపించడం సాధారణం. అయితే, దీని వెనక నిజమైన శాస్త్రీయ కారణాలు ఏంటో తెలుసుకోవడానికి నెదర్లాండ్స్‌లోని శాస్త్రవేత్తలు వేల మంది ప్రజలపై ప్రత్యేక ప్రయోగం నిర్వహించారు.

#image_title
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..
నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రముఖ సంగీత ఉత్సవం “లోలాండ్స్” వేదికగా, శాస్త్రవేత్తలు దాదాపు 500 మంది మనుషులు మరియు వేలాది దోమలతో ప్రయోగం చేశారు. ఈ ప్రయోగానికి ప్రత్యేకంగా ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసి, దోమల ప్రవర్తనను నిశితంగా పరిశీలించారు. ఒక పెట్టెలో వారి చేతిని ఉంచగా, దోమలు వాసన ఆధారంగా ఎంత సమయం ఉండిపోతున్నాయో, ఎంతమంది చేతులపై ఎక్కువగా వాలుతున్నాయో కెమెరాలతో రికార్డు చేశారు.
బీరు తాగిన వారు దోమలకు 1.35 రెట్లు ఎక్కువగా ఆకర్షణీయంగా కనిపించారు. మునుపటి రాత్రి ఎవరితోనైనా మంచం పంచుకున్న వారు, తక్కువ స్నానం చేసిన వారు, లేదా సన్‌స్క్రీన్ వాడని వారు కూడా దోమలకి టార్గెట్ అయ్యారు. “దోమలు నేరుగా ఆల్కహాల్ వైపు కాకుండా, బీరు తాగిన తర్వాత మన శరీరంలో వచ్చే వాసన మార్పు వైపు ఆకర్షితులవుతాయి. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే:
దోమలు 100 మీటర్ల (దాదాపు 350 అడుగులు) దూరం నుంచే మన వాసనను పసిగట్టగలవట. అంటే, మద్యం సేవించినవారు ఎంత దూరంలో ఉన్నా, శరీర దుర్వాసన మారితే దోమలు వారి వైపు వచ్చేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతాయి.