Betel Leaf : తమలపాకు లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Betel Leaf : తమలపాకు లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…!

Betel Leaf : తమలపాకులో అనేక ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. ఈ తమలపాకులో విటమిన్ సి, నియాసిన్, థయామిన్, కెరోటిన్, రిబోప్లావిన్ లాంటి పోషకాలు అధికంగా. ఈ తమలపాకును నమలటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తమలపాకును తాంబులం రూపంలో తినటం కంటే వాటిని నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకోవటం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటి అనేది […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 May 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Betel Leaf : తమలపాకు లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...!

Betel Leaf : తమలపాకులో అనేక ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. ఈ తమలపాకులో విటమిన్ సి, నియాసిన్, థయామిన్, కెరోటిన్, రిబోప్లావిన్ లాంటి పోషకాలు అధికంగా. ఈ తమలపాకును నమలటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తమలపాకును తాంబులం రూపంలో తినటం కంటే వాటిని నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకోవటం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనకు తెలుసుకుందాం..

దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక పాత్రను పెట్టుకోవాలి. తర్వాత దానిలో ఒక గ్లాసు నీరు పోసుకోవాలి. ఒక తమలపాకులు తీసుకొని దానిని ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్ లో వెయ్యాలి. ఐదు నుండి ఏడు నిమిషాల వరకు ఆ వాటర్ ను మరిగించి వడగట్టిన తర్వాత తాగాలి. మలబద్ధక సమస్య ఉన్నవారు కూడా ఈ తమలపాకు నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రేగు కదలికలు కూడా బాగా జరిగేలా చూస్తుంది. శరీరంలో వాపులను కూడా తగ్గించేస్తుంది. ఈ తమలపాకులో యాంటీ ఇన్ ఫ్ల మెంటరీ లక్షణాలు ఉండటం వలన చాతిలో పేరుకుపోయినటువంటి కఫాన్ని కూడా తొలగిస్తుంది. అంతేకాక జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ తమలపాకు నీరు మధుమేహన్ని నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉచ్చటమే కాకుండా మధుమేహం కారణంగా వచ్చే సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Betel Leaf తమలపాకు లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా

Betel Leaf : తమలపాకు లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…!

చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రై గ్లీజరైడ్స్ స్థాయిలను కూడా తమలపాకు నీరు తగ్గిస్తుంది. దీని ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ఈ తమలపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల అస్తమా లాంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. అంతేకాక తమలపాకును మౌత్ ప్రెషనర్ గా కూడా వాడతారు. ఇది నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడేలా చేస్తుంది. తమలపాకు నోటిలోని బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది. అయితే ఈ తమలపాకు నీటిని ఎప్పుడు పడితే అప్పుడు తాగటం కూడా అంతా మంచిది కాదు. రోజులో ఒకసారి మాత్రమే ఈ తమలపాకు నీరు తీసుకోవటం మంచిది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది