Betel Leaf : తమలపాకులు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా అద్భుతంగా పని చేస్తాయి… ఎలాగంటే…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Betel Leaf : తమలపాకులు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా అద్భుతంగా పని చేస్తాయి… ఎలాగంటే…??

Betel Leaf : తమలపాకులను ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. అలాగే ఈ తమలపాకులలో ఎన్నో ప్రత్యేకమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ తమలపాకులో విటమిన్లు మరియు మినరల్స్ ఉండటం వలన జుట్టు రాలే సమస్యను నయం చేస్తుంది. ఇవి ఎక్కువ తేమను కలిగి ఉంటాయి. అలాగే పొడి మరియు పెళుసైన జుట్టును కూడా తగ్గిస్తుంది. అంతేకాక ఈ తమలపాకులో విటమిన్ సి కూడా ఉంటుంది. అలాగే ఇవి జుట్టు పెరుగుదలను మరియు […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 November 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Betel Leaf : తమలపాకులు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా అద్భుతంగా పని చేస్తాయి... ఎలాగంటే...??

Betel Leaf : తమలపాకులను ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. అలాగే ఈ తమలపాకులలో ఎన్నో ప్రత్యేకమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ తమలపాకులో విటమిన్లు మరియు మినరల్స్ ఉండటం వలన జుట్టు రాలే సమస్యను నయం చేస్తుంది. ఇవి ఎక్కువ తేమను కలిగి ఉంటాయి. అలాగే పొడి మరియు పెళుసైన జుట్టును కూడా తగ్గిస్తుంది. అంతేకాక ఈ తమలపాకులో విటమిన్ సి కూడా ఉంటుంది. అలాగే ఇవి జుట్టు పెరుగుదలను మరియు ఆరోగ్యకరమైన జుట్టుకు హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ తమలపాకులనేవి స్కాల్ప్ మరియు ఇన్ఫెక్షన్ లేకుండా చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు జుట్టు పెరుగుదలకు మేలు చేస్తాయి. అలాగే ఇవి చండ్రు తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి…

తమలపాకులు అనేవి జుట్టును స్ట్రెయిట్ గా కూడా చేస్తాయి. అలాగే మీ జుట్టును మందంగా మరియు పొడవుగా కూడా చేస్తుంది. అంతేకాక ఈ తమలపాకులలో పొటాషియం మరియు నీకోటిక్ యాసిడ్, విటమిన్లు A B1 B2 C ఇతర రకాల విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉన్నాయి. అలాగే వీటిలో ఎన్నో రకాల యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టుకు తమలపాకు యొక్క చికిత్స ఎక్కువ అవసరం కూడా ఉండదు. దీనికోసం తమలపాకులను కడిగి వాటిని మేత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఒక గంట సేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో షాంపుతో తలస్నానం చేయాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే నాలుగు ఐదు తమలపాకులు మరియు ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె మరియు ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

Betel Leaf తమలపాకులు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా అద్భుతంగా పని చేస్తాయి ఎలాగంటే

Betel Leaf : తమలపాకులు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా అద్భుతంగా పని చేస్తాయి… ఎలాగంటే…??

ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి నూనె మరియు కాస్టర్ ఆయిల్, కొన్ని చుక్కల నీటిని కూడా వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ తలకు మరియు జుట్టుకు బాగా అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. దీనిని ఒక 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత తల స్నానం చేయాలి. అలాగే తమలపాకు మరియు నువ్వుల నూనెతో కూడా హెయిర్ మాస్క్ ని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం నాలుగు లేక ఐదు తమలపాకులు మరియు నువ్వుల నూనె ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె ఒక టీ స్పూన్ మరియు కొన్ని చుక్కల నీటిని కూడా వేసుకోవాలి. ఈ తమలపాకులలో నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనెతో కలుపుకొని రుబ్బుకోవాలి. వీటన్నిటిని పేస్ట్ చేయడానికి కొన్ని చుక్కల నీటిని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేసుకోవాలి. దీనిని ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. తర్వాత జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది