Dialysis : డయాలసిస్ ఎవరికీ అవసరం... ఎందుకు చేస్తారు... చేయకుంటే ఏమవుతుంది..??
Dialysis : మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలో రక్తం నుండి టాక్సిన్స్ మరియు వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం కిడ్నీల యొక్క ముఖ్య పని. అలాగే శరీరం నుండి వ్యర్ధ పదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపించడం కూడా దీని యొక్క ముఖ్య బాధ్యత. ఇటువంటి పరిస్థితులలో కిడ్నీలు పనిచేయడం మానేస్తే, శరీరంలో టాక్సిన్స్ మరియు వ్యర్ధపదార్థాలు అనేవి పేరుకుపోయి ఎన్నో రోగాలకు కారణం అవుతుంది. ప్రస్తుత కాలంలో అనారోగ్య జీవనశైలి కారణం చేత ఎంతోమంది కిడ్నీల సమస్య బారిన పడుతున్నారు. దీంతో మధుమేహం మరియు అధిక రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యానికి కూడా ముఖ్య కారణాలు అని చెప్పొచ్చు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ మరియు కిడ్నీ వ్యాధి లాంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఒకవేళ మీ మూత్రపిండాలు గనుక విఫలమైతే డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుభ్రపరుస్తారు. దీనిని మన శరీరంలోని వ్యర్ధపదార్థాలను తొలగించడానికి ఎక్కువగా వాడతారు. అలాగే కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలో మరియు డయాలసిస్ కు సంబంధించిన ఇతర విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…
డయాలసిస్ అంటే ఏమిటి : మన శరీరంలో మూత్రపిండాల ప్రధాన పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం. అలాగే కొన్ని సందర్భాలలో మూత్రపిండాల వైఫల్యం కూడా సంభవిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే డయాలసిస్ అవసరం అవుతుంది. అయితే ఈ డయాలసిస్ అనేది శరీరం నుండి రక్తాన్ని తీసివేసి యంత్రం ద్వారా రక్తాన్ని క్లీన్ చేసి తిరిగి శరీరానికి చేరవేసే పద్ధతిని డయాలసిస్ అంటారు…
డయాలసిస్ ఎవరికోసం చేస్తారు : కిడ్నీ ఫెయిల్యూర్ మరియు ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీస్ తో ఇబ్బంది పడే వారికి డయాలసిస్ చేస్తారు. అలాగే అధిక రక్తపోటు మరియు మధుమేహం లూపస్ లాంటి సమస్యలు ఉన్నవారికి కిడ్నీలు అనేవి తొందరగా దెబ్బతింటాయి. ఇది కిడ్నీ వ్యాధికి కారణం అవుతుంది. అంతేకాక మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో మరియు వారి యొక్క మూత్రపిండాల సాధారణ పనితీరు తగ్గి 10 నుండి 15% వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు జీవించడానికి డయాలసిస్ లేక కీడ్ని మార్పు అనేది అవసరం అవుతుంది. అలాగే కీడ్ని అనేది అందుబాటులో ఉంటేనే కిడ్నీ మార్పు చేయడం జరుగుతుంది. లేకుంటే రోగులకు డయాలసిస్ ఒకటే మార్గం…
Dialysis : డయాలసిస్ ఎవరికీ అవసరం… ఎందుకు చేస్తారు… చేయకుంటే ఏమవుతుంది..??
డయాలసిస్ ఎన్ని రోజులు చేస్తారు : ప్రతి రోగికి డయాలసిస్ టైం అనేది మారుతూ ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం ఇది రోజు అవసరం. ఇంకొంతమంది అయితే ఒకటి లేక రెండు రోజుల వ్యవధిలో చేయించుకుంటారు. అలాగే డయాలసిస్ ద్వారా రోగుల యొక్క రక్తాన్ని యంత్రం ద్వారా క్లిన్ చేస్తారు. దీంతో రక్తం నుండి వ్యర్ధపదార్థాలను బయటకు పంపించి మళ్లీ తిరిగి శుబ్రమైన రక్తాన్ని శరీరంలోకి చేరవేస్తారు.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.