Morning : ఉదయం లేవగానే కాళ్లు, చేత్లోల జలదరింపు వస్తోందా.. చాలా డేంజర్..!
Morning : ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యకరమైన తిండి లేకున్నా, సరైన వ్యాయామాలు చేయకపోయినా అనుకోని రోగాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. అందుకే మంచి తిండి, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవాలి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కొన్ని సార్లు అనుకోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఉదయాన్నే లేచినప్పుడు కాళ్లు, చేతుల్లో జలదరింపుగా అనిపించడం కూడా ఒకటి. రోజులో ఎక్కువ గంటలు కూర్చుని పని చేసేవారిలో, లేదంటే బాడీలో ఒక భాగంపై బరువు పెట్టినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది.
Morning విటమిన్ లోపం..
కానీ అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయకపోయినా సరే జలదరింపు వస్తుందంటే మాత్రం కచ్చితంగా వేరే ఇతర అనారోగ్య సమస్యలు మీలో వస్తున్నట్టే అని గుర్తుంచుకోవాలి. ఇలా జలదరింపులు రావడానికి విటమిన్ లోపం కూడా కారణం కావచ్చు. మరీ ముఖ్యంగా విటమిన్ B12, విటమిన్ B6, విటమిన్ B1, విటమిన్ E, విటమిన్ B9 లేదా ఫోలేట్ లాంటి లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా షుగర్ వ్యాధి ఉన్న వారిలో కూడా ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. బ్లడ్ లో ఎక్కువ మొత్తం షుగర్ చేరినప్పుడు నరాలకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వల్ల నరాలకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నరాలకు తగినంత ఆక్సిజన్ లభించనప్పుడు. అవి సరిగ్గా పనిచేయవు. దాంతో పాటు చుట్టూ ఉండే సిరలపై కూడా ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు సిరలు ఎండిపోతాయి. అంతే కాకుండా జలదరింపు, తిమ్మిరి లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇంకా కొన్ని సార్లు అయితే కిడ్నీలు సరిగ్గా పని చేయనప్పుడు కూడా ఇలా ఉదయాన్నే జలదరింపులు కూడా వస్తుంటాయి. అధిక రక్తపోటు, అధికంగా షుగర్ ఉన్న వారిలో కిడ్నీలు పనిచేయక ఇలా జలదరింపులు కూడా వస్తుంటాయి. అలాంటి సమయంలో కచ్చితంగా నరాలు దెబ్బతింటాయి. ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వ్యర్థ పదార్థాలు బాడీలోనే పేరుకుపోయి నరాలకు సమస్యగా మారుతుంది. కాబట్టి మీలో రెండు రోజుల కంటే ఎక్కువగా ఇలా జలదరింపులు వస్తున్నాయంటే కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.