Hair Tips : చలికాలంలో మీ జుట్టు పొడిబారి పోతుందా.. అయితే ఈ చిట్కాలను ట్రై చేసి చూడండి…!!
Hair Tips : చలికాలంలో చాలామంది జుట్టు నిర్జీవంగా పొడిబారినట్టుగా అయిపోతూ గడ్డి గడ్డిలా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అయితే చల్లటి గాలిలో బయట తిరగడం వలన జుట్టు పొడి బారి డల్ గా అవుతూ ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసిన వెంటనే చర్మం పై తెల్ల మచ్చలు లాగా కూడా కనిపిస్తూ ఉంటాయి. తలస్నానం చేశాక జుట్టు నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు వహించిన జుట్టు గడ్డిలా అయిపోతుంది.. ఈ చలికాలంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా జుట్టు, చర్మ సంబంధ సమస్యలు ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం కలగడానికి మనం షాంపూలు కండిషన్లపై ఆధారపడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో జుట్టుని మెరిసేలా చేసుకోవచ్చు. జుట్టు సంబంధిత నిపుణులు చెప్పిన ఇంటి చిట్కాలను ఒకసారి ట్రై చేద్దాం…
తేనె, అలీవ్ నూనె : తేనె, ఆలీవ్ నూనె, బొప్పాయి కొంచెం బియ్యం కలిపి మెత్తటి పేస్టులా చేసి జుట్టుకి పెట్టుకుంటే శీతాకాలంలో జుట్టు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. షాంపూ చేసుకునే 20 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని జుట్టుకి పెట్టుకొని తలస్నానం చేయాలి. ఇది జుట్టుని మృదువుగా, నునుపుగా చేస్తుంది. రోజ్ వాటర్ : కొన్ని రోజ్ వాటర్ తో మీ స్కాల్పుని మసాజ్ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇది పొడి జుట్టు సమస్య నుండి బయట పడేస్తుంది. నీరు ,పోషకాహారం : మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆహార నియమాలు పాటించకపోతే పెద్దగా రిజల్ట్ ఉండదు. కావున ఎక్కువగా నీరు తాగడం అలాగే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ సీజన్లో దొరికే పండ్లు కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది.. నూనెతో మసాజ్ : ఈ చిట్కా పాతదైన చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతిరోజు నూనెతో కాసేపు మీ తలని మసాజ్ చేసుకోవాలి.
ఈ విధంగా చేయడం వలన జుట్టులో తేమ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా తలస్నానం చేసే ముందు కచ్చితంగా జుట్టు స్కాల్పుని మసాజ్ చేయాలి. షికాయ, ఉసిరి : శికాయ, ఉసిరి ముల్తాని మట్టిని సమపాల్లో తీసుకొని మిక్సీ పట్టి మిశ్రమం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పెట్టుకోవాలి. తర్వాత 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకి కండిషన్ ర్ లా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది.. తేనె, నిమ్మకాయ, కొబ్బరి నూనె : నిమ్మకాయ తేనె కొబ్బరి నూనె ఇలాంటివి జుట్టుకి సహజ కండిషనర్ల కా సహాయపడతాయి. అలాగే హెయిర్ ఫాల్ సమస్యను కూడా దూరం చేస్తాయి. అదేవిధంగా తలకు తేమను అందించి చుండ్రు సమస్య లేకుండా చేస్తాయి. తేనే కొబ్బరి నూనె తీసుకొని అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి జుట్టుకి అప్లై చేయాలి.40 తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి..