Immunity Boost Foods : శీతాకాలంలో ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యంగా ఉంచే దుంపలు ఇవే…!!
Immunity Boost Foods : శీతాకాలం వచ్చిందంటే చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుఉంటారు. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎన్నో రకాల వ్యాధులను బారిన పడే అవకాశం ఉంటుంది.. అసలు మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యల ఎదుర్కోవచ్చు.. ఈ శీతాకాలంలో కొన్ని రకాల దుంపలును తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. చలికాలం ఈ దుంప కూరగాయలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం..
క్యారెట్ : క్యారెట్లు విటమిన్ ఏ, సి ఐరన్, క్యాల్షియం, పొటాషియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ క్యారెట్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మెరిసేలా కూడా చేస్తాయి..
చిలకడదుంపలు : ఈ చిలకడదుంపలలో విటమిన్ సి, బి6 పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కూడా బీటా కెరటం విటమిన్ ఈ సి, బి6 పొటాషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ వంటివి కంటి చూపును మెరుగుపరుస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్యం తగ్గిస్తాయి. దీనిలోని పోషకాలు రోగినిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడతాయి
టర్నిప్స్ : టర్పీస్ లోక్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఫైబర్ విటమిన్ సి పొటాషియం అండ్ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియ కు సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. బరువు తగ్గాలి అనుకునేవారు వారి డైట్ లో ఇది కచ్చితంగా చేర్చుకోవాలి.
బీట్రూట్ : బీట్రూట్ లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సమయం పాటు శక్తినిస్తాయి. ఈ దుంపలో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది. బీట్రూట్ యొక్క రసం చక్కని డీటాక్స్ ల పనిచేస్తుంది. కడుపులోని ఆమ్లాలను క్రమబద్ధీకరించి హ్యాపీగా సాగిలా చేస్తుంది.
ముల్లంగి : ముల్లంగిలో పొటాషియం, ఫైబర్, జింక్, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్ మాంగనీస్, విటమిన్ ఏ, బి, సి ఈ కే విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయి… ఈ దుంపలన్ని కూడా శీతాకాలంలో ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి… అనారోగ్య బారిన పడకుండా చేస్తాయి..