Health Tips : ఈ ఆహార పదార్థాలతో మీ కంటి సమస్యలకి, కళ్ళజోడుకు గుడ్ బై చెప్పవచ్చు…!!
Health Tips : ఇప్పుడున్న జనరేషన్లో ప్రపంచవ్యాప్తంగా వయసు తరహా లేకుండా చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు వచ్చే సమస్య కంటి సమస్యలు.. ఈ సమస్యలకు కారణం ఎక్కువ సమయం కంప్యూటర్లు, సెల్ ఫోన్ లను వాడడం వలన ఈ సమస్యలు త్రీవంగా మారుతున్నాయి. ఈ కంటి సమస్యల ప్రమాదం నుంచి బయట పడాలంటే కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సరియైన పోషక ఆహారం చాలా ముఖ్యం. ఈ ఆహారం తీసుకోవడం వలన తక్కువ సమయంలోనే కళ్ళజోడుకి కూడా బాయ్ బాయ్ చెప్పవచ్చు… అని వైద్య నిపుణులు చెప్తున్నారు.
జనరల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్లోని ఓ పరిశోధన ప్రకారం లాప్టాప్, మొబైల్స్ స్క్రీన్, కంప్యూటర్లపై ఎక్కువ సమయం ఉండడం వలన మీ కళ్ళకు ప్రమాదం. అలాగే కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో కంటి చూపు సంరక్షణ కోసం పండ్లు ,కూరగాయలు రసాలను ఎక్కువగా తీసుకోవాలి. *గ్రీన్ లీప్ వెజిటేబుల్స్ యాంటీ ఆక్సిడెంట్ కు చాలా మంచి మూలం. ఇవి కళ్ళకు ఎంతో ఉపయోగపడతాయి. దీనిలో జియా కీప్తిన్, లూటీన్ ఉంటాయి. ఇవి కంటిపై పడే హానికరమైన కాంతి కిరణాల ఎఫెక్ట్ను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
*ఆరెంజ్ జ్యూస్ కళ్ళని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి ప్రధాన వనరులలో ఒకటి. ఈ రసం తీసుకోవడం వలన కంటి శుక్లాం వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. *కళ్ళకి కావాల్సిన పోషకాలు చాలావరకు ఈ టమాటా జ్యూస్ లో ఉంటాయి. టమాటాలో ఉండే విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఏ లాంటి ఎన్నో పోషకాలు మన కంటి చూపును పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. *కొబ్బరి నీటిలో విటమిన్ లతో ఇతర ప్రధానమైన కణజాల తో పాటు ఆ మైను ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ళ సురక్షిత కణజాలను మెరుగుపరచడానికి ఎంత బాగానో ఉపయోగపడతాయి.