Women : మహిళలకు ఋతుచక్ర సమస్య, గర్భాశయం బలం ఉండాలాన్నా ఈ యోగాసనాలు వేస్తే చాలు…?
ప్రధానాంశాలు:
Women : మహిళలకు ఋతుచక్ర సమస్య, గర్భాశయం బలం ఉండాలాన్నా ఈ యోగాసనాలు వేస్తే చాలు...?
Women : మహిళలకు ఋతుచక్రం సమయంలో స్త్రీలు ఎంతో తీవ్రమైననొప్పిని, బాధను అనుభవిస్తారు. ఆ స్త్రీలలో గర్భాశయం బలంగా లేకపోతే గర్భం దాల్చాలని కూడా చాలా కష్టంగా ఉంటుంది. స్త్రీలకు గర్భాశయం బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే సంతానం కలుగుతుంది.ఇంకా, ఆ స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి గర్భాశయ బలాన్ని పెంచాలంటే, శారీరక శ్రమ,మందులు కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేది, బలోపేతం చేసే హార్మోన్ల సమతుల్యం చేసే మానసికంగా ప్రశాంతతను ఇచ్చే యోగాసనాలు గురించి.యోగ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం… మహిళలకు ముఖ్యమైనది గర్భాశయం. ఆరోగ్యంగా ఉంటేనే మహిళలకు అమ్మతనం దక్కుతుంది. కేవలం గర్భాశయం బలంగా ఉంటే సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి మాత్రమే కాదు. ఋతుచక్రం సరిగ్గా ఉండడానికి, హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే సమస్యలను నివారించడానికి, మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది చాలా అవసరం. యోగా గర్భాశయాన్ని బలోపేతం చేస్తుంది. యోగా శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. రోజు స్త్రీ గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు,కొన్ని యోగాసనాలు వేయాలని యోగా నిపుణులు తెలియజేస్తున్నారు…

Women : మహిళలకు ఋతుచక్ర సమస్య, గర్భాశయం బలం ఉండాలాన్నా ఈ యోగాసనాలు వేస్తే చాలు…?
Women సీతాకోక చిలుక భంగిమ
ఈ ఆసనాన్ని బద్దకోనాసన అని కూడా పిలుస్తారు.ఈ ఆసనం ఇది తుండి, గజ్జలను సాగదీయడానికి సహకరిస్తుంది. ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇంకా గర్భాశయానికి బలాన్ని పెంచుతుంది.అంతేకాదు, గర్భాశయ కండరాల రక్తప్రసరణను సరిగ్గా జరిగేలా చేస్తుంది. బద్దకోనసనం రోజువారి అభ్యాసం స్త్రీలకు వచ్చే ఋతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
భుజంగాసన( కోబ్రా భంగిమ )
భుజంగాసన లేదా కోబ్రా భంగిమ వెన్నెముకకు వశ్యతను ఇవ్వడమే కాదు. గుండె,ఊపిరితిత్తుల వంటి శరీరా అంతర్గత అవయవాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా ఆసనం వేసేటప్పుడు కటి అంతస్తు నరాలు మంచి సాగతీతను పొందుతాయి.ఈ యోగాసనం గర్భాశయం బలాన్ని పెంచి కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
బ్రిడ్జి ఫోజ్ : యోగాసనం స్త్రీలకు ఎంతో ప్రయోజనకరం.ఎందుకంటే, వీపు, నడుము కండరాలను సరళంగా కాకుండా,కటి ప్రాంతాన్ని కూడా బలపరుస్తుంది. ఈ యోగాసనం ప్రతిరోజు సాధన చేస్తే గర్భాశయం వైపు వెళ్లే రక్తప్రసరణ మెరుగు పడుతుంది.ఈ ఆసనం హార్మోన్ల సమతుల్యతను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
మలాసాన గుర్రం భంగిమ : మహిళలో ప్రతిరోజు కొన్ని సెకండ్ల పాటు మలసానంలో కూర్చోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు ఇది కటి ప్రాంతం గర్భాశయాన్ని బలోపేతం చేయడమే కాదు జీర్ణ వ్యవస్థను కూడా సక్రమ్ చేస్తుంది. ఈ ఆసనం క్రమం తప్పకుండా సాధన చేస్తే, మలబద్ధకం, ఒత్తిడి, పీరియడ్ సమయంలో నొప్పి, పొత్తికడుపులో వాపు, గ్యాస్ మొదలైన సమస్యలన్నీ కూడా నివారించబడుతుంది.