Yoga : నిత్యం ఈ ఐదు యోగాసనాలు చేస్తే చాలు… ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Yoga : నిత్యం ఈ ఐదు యోగాసనాలు చేస్తే చాలు… ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!

 Authored By ramu | The Telugu News | Updated on :25 August 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Yoga : నిత్యం ఈ ఐదు యోగాసనాలు చేస్తే చాలు... ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే...!

Yoga : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి అధిక రక్త పోటు. ఈ సమస్య అనేది ఎంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. అలాగే గుండె మరియు మెదడు, మూత్రపిండాలు లాంటి ముఖ్యమైన అవయవాలపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. కనుక మన రోజువారి దిన చర్యలో కొన్ని యోగ ఆసనాలు చేయాలి. మరి ముఖ్యంగా హై బీపీ సమస్యతో బాధపడేవారు ప్రతినిత్యం ఐదు యోగ ఆసనాలు కచ్చితంగా చేయాలి. దీని వలన బీపీ అనేది అదుపులో ఉండి ఎప్పుడు మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే మనం చేయవలసిన ఆ ఐదు యోగాసనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

Yoga  పవన్మక్తాసనం

అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు నిత్యం కొన్ని నిమిషాల పాటు పవన్మక్తసనం చెయ్యాలి. అయితే ఈ ఆసనం చేయడం అంత కష్టం ఏమి కాదు. అయితే ఈ ఆసనం చేయడం వలన గుండె ఆరోగ్యంగా ఉండటమే కాక కడుపులో గ్యాస్ రిలీజ్ కావటం మరియు వెన్నునొప్పి నుండి ఉపశమనం, ఒత్తిడి తగ్గించటం, పొట్ట దగ్గర కొవ్వు తగ్గటం, ఎసిడిటీ లాంటి వాటి నుండి ఉపశమనం కలిగించడంతో పాటు ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది…

బలాసనం : బలాసనం వేయడం వలన కూడా మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాక ఒత్తిడి నుండి ఉపశమనం కూడా కలుగుతుంది.అలాగే నిద్రను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం బీపీ ఉన్నటువంటి వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ యోగాసనం అనేది అలసటను కూడా దూరం చేయగలదు. అలాగే గుండె కండరాలను కూడా బలంగా చేస్తుంది. అంతేకాక బలాసనం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగకరంగా కూడా పనిచేస్తుంది. ఈ ఆసనం వేయడం వలన స్త్రీలు పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలను కూడా దూరం చేసుకోగలుగుతారు…

సేతుబంధాసనం : మీరు ఈ ఆసనాన్ని చేస్తున్నప్పుడు ఛాతి కండరాలు అనేవి తెరుచుకుంటాయి. దీనితో పాటు ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక రక్త ప్రసరణ ను కూడా మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేయడం వలన అధిక రక్తపోటు తో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడి నుండి ఉపసమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక నిద్రలేమి, ఉబ్బసం, థైరాయిడ్ మొదలైన వాటి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ ఆసనాన్ని నిత్యం బాగా అభ్యాసం చేయడం వలన ఆరోగ్యానికి మంచిది…

హాస్త పదంగుష్ఠసనం : ఈ ఆసనం వేయడం వలన అధిక బీపీ ఉన్నటువంటి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఆసనం వేయటం వల్ల చీలమండలు మరియు తొడలు, తుంటి, తోడ కండరాలు ఎంతో దృఢంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాక ఏకగ్రతను కూడా పెంచగలదు.

Yoga నిత్యం ఈ ఐదు యోగాసనాలు చేస్తే చాలు ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే

Yoga : నిత్యం ఈ ఐదు యోగాసనాలు చేస్తే చాలు… ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!

భ్రమరీప్రాణాయామం : అధిక రక్తపోటుతో బాధపడేవారు నిత్యం ఈ ఆసనం కచ్చితంగా చేయాలి. ఇలా చేయడం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేయడం వలన ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక ఆందోళన,మైగ్రేన్, సాధారణ తలనొప్పి తగ్గటం మరియు మనస్సు ప్రశాంతత, దృష్టి పెరగడం, వినికిడి, సామర్థ్యం పెరగడం లాంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది