Yoga Asanas : మీ మెదడుకు పదును పెట్టాలన్నా… మీ ఏకాగ్రత పెరగాలన్నా… ఈ బెస్ట్ యోగ ఆసనాలు ఫాలోవాల్సిందే…?
ప్రధానాంశాలు:
Yoga Asanas : మీ మెదడుకు పదును పెట్టాలన్నా... మీ ఏకాగ్రత పెరగాలన్నా... ఈ బెస్ట్ యోగ ఆసనాలు ఫాలోవాల్సిందే...?
Yoga Asanas : ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మానసిక వేదనతో బాధలు పడుతూనే ఉన్నారు. ఏదో ఒక ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు. ప్రస్తుత బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతూనే ఉంటున్నారు. మనం మానసికంగా ప్రశాంతంగా గడిపితే కొన్ని కోట్ల సంపద ఉన్నట్లే. మనశ్శాంతి కరువైతే మనోవేదన గురవుతాం.మన భావోద్వేగాలని అదుపు చేసుకోలేం. తీరికలేని పనులలో బిజీగా అవ్వడం చేత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. ప్రశాంతత కరువై అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. ప్రతిరోజు ఆనందంగా,ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఒత్తిడి నుంచి బయట పడాలంటే తప్పకుండా ఇలాంటి యోగాలు చేస్తే,మంచి ఫలితం తో పాటు,మానసిక ప్రశాంతత మంచి ఏకాగ్రత కలుగుతుంది. మానసిక ప్రశాంతతను పెంచుకొనుటకు ఎలాంటి యోగాసనాలు చేయాలి, నిపుణులు ఏం తెలియజేస్తున్నారు తెలుసుకుందాం…

Yoga Asanas : మీ మెదడుకు పదును పెట్టాలన్నా… మీ ఏకాగ్రత పెరగాలన్నా… ఈ బెస్ట్ యోగ ఆసనాలు ఫాలోవాల్సిందే…?
Yoga Asanas తడసన (పర్వత భంగిమ )
కొన్ని రకాల యోగాసనాలు వేస్తే మెదడు పనితీరు మెరుగ్గా పనిచేయటమే కాకుండా అధిక మానసిక స్థితిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ప్రశాంతతకు ఇచ్చే ఆసనాలలో తడసనం ఆసనం ఒకటి. ఈ ఆసనం వేయడం వలన మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరిగే నాడి వ్యవస్థా పని తీరు బాగుంటుంది.దీనిని ఎలా చేయాలి అంటే.. నిటారుగా నిలబడి రెండు చేతులు పైకి లేపి నమస్కరిస్తూ ఉండాలి. శరీరాన్ని పూర్తిగా పైకి వంచాలి.
వృక్షాసన (వృక్ష భంగిమ ) : ఈ భంగిమ, మెదడు కండరాలను బలోపేతం చేయడానికి అద్భుతమైన ఆసనం వృక్షాసనం. రెండు పాదాలపై నిలబడి,తరువాత మరొక కాలిని మోకాలి పై వరకు పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడి నమస్కారం చేయాలి.ఇలా రోజు పది నిమిషాలు చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు యోగానిపుణులు.
పద్మాసనం : పద్మాసనము యోగాలో చాలా ఈజీగా చేయవచ్చు. చాలామంది ఇష్టంగా చేసే ఆసనాలలో ఇదొకటి. ఈ ఆసనం జ్ఞాన భంగిమలా ఉంటుంది. ఈ ఆసనం వేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అందుకే ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు ఈ ఆసనం వేస్తే మంచిది.
బాలాసనం : బాలాసనం నాడీ వ్యవస్థను సక్రమంగా సాగేలా చేస్తుంది. దీనిని ఈ విధంగా వేయండి. మోకాలపై వంగి, తలను నేలకు ఆనించి,రెండు అరచేతులను నేలపై ఉంచాలి. కనీసం రెండు నిమిషాల పాటు ఇలా చేస్తే, శ్వాస సమస్యలన్నీ తొలగిపోతాయట.
త్రతక ఆసనం : ఈ ఆసనం శారీరక భంగిమ కాకపోయినా,ఈ యోగా వ్యాయామం, కళ్ళు,మనసుకు ఒకే దాటిగా తీసుకొస్తాయి. దీనిని చీకటి ప్రదేశంలో ఒకచోట కొవ్వొత్తిని వెలిగించి, కొద్ది దూరంలో కూర్చొని వెలిగే మంటనే చూడాలి.తరువాత, కళ్ళు మూసుకొని దానిని ఊహించుకోవాలి.