Yoga : ఆఫీసుల్లో గంటలు తరబడి పని చేసేవారు చేయవలసిన యోగాసనాలు ఇవే…!
ప్రధానాంశాలు:
Yoga : ఆఫీసుల్లో గంటలు తరబడి పని చేసేవారు చేయవలసిన యోగాసనాలు ఇవే...!
Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ టైం గడుపుతున్నారు. అయితే కొంతమందికి తమ డెస్క్ నుండి లేవడానికి మరియు అటు ఇటు తిరగటానికి కూడా టైం ఉండదు. ఇలాంటి వ్యక్తులకు మాత్రం ఆరోగ్యం హానికరంగా మారుతుంది. అయితే మీరు ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వలన శరీరం చురుకుదనం అనేది తగ్గుతుంది. అంతేకాక కండరాలు మరియు ఎముకలు బలహీనతకు కూడా దారితీస్తాయి. అలాగే ఊబకాయం మరియు ఎన్నో సమస్యల ప్రమాదాలు కూడా పెరుగుతాయి. అయితే ప్రతి రోజు కూడా గంటల తరబడి ఒకే చోట కూర్చొని ల్యాప్ టాప్ పై పనిచేయడం వలన మెడ మరియు వెన్ను, భుజాలపై నొప్పి అనేది వస్తుంది. అలాగే ఇది మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఈ సమస్యలను తగ్గించుకోవడానికి రోజులో కొత్త టైం కేటాయించుకొని యోగా చేయాలి. అయితే యోగ చేయటం వలన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అలాగే కండరాల బలం కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. అంతేకాక బరువుని నియత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే యోగ అనేది మానసిక ఆరోగ్యానికి మరియు శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో ప్రతిరోజు సులభమైన యోగ ఆసనాలు చేయడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం…
Yoga తాడాసరం
ఈ ఆసనాన్ని పర్వత భంగిమ అని కూడా అంటారు. అయితే వెన్నెముకకు ఎంతో ప్రయోజనకరంగా ఉండడమే కాకుండా శరీర భంగిమను మెరుగుపరచడంలో మరియు ఎక్కువ బొడ్డు కొవ్వును తగ్గించడంలో కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ యోగాసనం చేసేందుకు ముందుగా జాగ్రత్తగా నిటారుగా నిలబడాలి. తర్వాత మీ రెండు చేతులను తలపైకి తీసుకొని రెండు చేతుల వేళ్ళ ను ఒక్కటిగా జత చేసుకొని ఆ చేతులను నిటారుగా ఉంచుకోవాలి. దీని తర్వాత కాళ్ల మడిమలను కూడా ఎత్తండి. తర్వాత కాళీ మీద నిలబడెందుకు ప్రయత్నం చేయండి…
భుజంగాసనం : ఈ ఆసనాన్ని కోబ్రా ఫోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనంలో శరీరం పాముల తయారు అవుతుంది కనుక దీనిని భుజంగాసనం అని అంటారు. అయితే ఈ యోగ ఆసనం కండరాలను బలంగా చేయడంలో మరియు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే తిమ్మిరిని నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా మీరు పొట్టమీద యోగ చాప మీద పడుకోవాలి. తర్వాత అరీ కాళ్ళ ను పైకి లేపి ఉంచాలి. ఇప్పుడు మీ చేతులను ఛాతి దగ్గరకు తీసుకోచ్చి అరచేతులను క్రిందకి ఉంచాలి. దీని తర్వాత దీర్ఘ శ్వాసను తీసుకోవాలి. తర్వాత నాభిని కూడా పైకి ఎత్తాలి. తర్వాత తల మరియు మెడను పైకి ఎత్తాలి. దీని తర్వాత నెమ్మదిగా ఛాతి మరియు కడుపుని ఎత్తాలి. మీరు ఆకాశం వైపు లేక పైకప్పు వైపు చూస్తున్నట్లయితే, ఐదు నుండి 10 సెకండ్ల వరకు ఈ భంగిమలోనే ఉండాలి…
వజ్రాసనం : ఈ ఆసనం ఉదర అవయవాల పని తీరును మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థకు కూడా మంచిది. ఈ ఆసనం వేయటానికి మీ కాళ్ళను వచ్చి మీ కాళీ వేలు పై కూర్చోవాలి. అలాగే రెండు పాదాల కాలు వేళ్లను కలపాలి. అలాగే మడమల మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోవాలి. తర్వాత శరీరం మొత్తం బరువును పాదాలపై ఉంచాలి. తర్వాత మీ రెండు చేతులను తొడలపై ఉంచుకోవాలి. ఈ టైంలో నడుము పైన భాగం కచ్చితంగా నిటారుగా ఉండేలా చూసుకోవాలి…