Tongue : మీ నాలుకను బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఈజీగా చెప్పొచ్చు తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tongue : మీ నాలుకను బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఈజీగా చెప్పొచ్చు తెలుసా…!

Tongue : మన కళ్ళు పసుపు రంగులో మారిన లేక చర్మం పసుపు రంగులోకి మారిన కామెర్ల వ్యాధికి సంకేతం గా చెబుతారు. అలాగే నాలుక రంగును బట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నాలుక రంగు అనేది మీ శరీరంలోని ఇతర రకాల వ్యాధులను సూచిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చేసె మొట్ట మొదటి పని నాలుక చూడడం. నిజం చెప్పాలంటే నాలుకను […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 September 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Tongue : మీ నాలుకను బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఈజీగా చెప్పొచ్చు తెలుసా...!

Tongue : మన కళ్ళు పసుపు రంగులో మారిన లేక చర్మం పసుపు రంగులోకి మారిన కామెర్ల వ్యాధికి సంకేతం గా చెబుతారు. అలాగే నాలుక రంగును బట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నాలుక రంగు అనేది మీ శరీరంలోని ఇతర రకాల వ్యాధులను సూచిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చేసె మొట్ట మొదటి పని నాలుక చూడడం. నిజం చెప్పాలంటే నాలుకను చూసి మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేరా అని చెప్పొచ్చు. అయితే ఈ నాలుక రంగులు ఏ రకాల వ్యాధులను చూసిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం…

మీ నాలుక పై గనక తెల్లని మచ్చలు ఉన్నట్లయితే అది ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు సంకేతం. అలాగే నాలుక పై తెల్ల మచ్చలు అనేవి ఎక్కువగా పిల్లలు లేక వృద్ధులలో కనిపిస్తాయి. అయితే తెల్లటి నాలుక అనేది నిర్జలీకరణంతో సమస్యలను సూచిస్తుంది. అలాగే ల్యూకోప్లాకియలో కూడా తెల్ల మచ్చలు కనిపిస్తాయి. అలాగే నాలుగు అనేది నల్లగా ఉంటే గొంతు ఇన్ఫెక్షన్ లేక బ్యాక్టీరియా కు సంకేతం. అలాగే అధికంగా మందులు వాడే వారికి కూడా నాలుక నల్లగా మారుతుంది. అంతేకాక మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా నాలుక నల్లగా ఉంటుంది. అలాగే క్యాన్సర్ సమస్యతో బాధపడే వారికి కూడా నాలుక నల్లగా ఉంటుంది. అంతేకాక కడుపు పూత సమస్యతో బాధపడే వారికి కూడా నాలుక రంగు అనేది మారుతుంది. కావున మీకు గనక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించటం మర్చిపోకండి. అలాగే పసుపు నాలుక అనేది కామేర్లకు సంకేతం. కానీ ఇది ప్రారంభ సంకేతం మాత్రమే…

Tongue మీ నాలుకను బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఈజీగా చెప్పొచ్చు తెలుసా

Tongue : మీ నాలుకను బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఈజీగా చెప్పొచ్చు తెలుసా…!

నాలుక అనేది నీలం మరియు గోధుమ రంగులోకి మారితే చాలా ప్రమాదకరం. అయితే గోధుమ రంగులో ఉన్న నాలుక అనేది గుండె సమస్యకు సంకేతం. అయితే గుండె రక్తాన్ని సరిగ్గా పంపు చేయలేనప్పుడు లేక రక్తంలో ఆక్సిజన్ అనేది లేనప్పుడు నాలుకపై గోధుమ రంగు పూత అనేది వస్తుంది. అలాగే నాలుక లేత మరియు లేత గులాబి రంగులో గనక ఉంటే శరీరంలో రక్తం లేకపోవడాన్ని చూపిస్తుంది. అలాగే రక్తహీనత మరియు విటమిన్ బి -12 లోపం కూడా దీనికి కారణం కావచ్చు. ఇలా గనక ఉంటే మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి.అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులకు నాలుక రంగు ఎలా ఉండాలి. అనే సందేహం మీకు కూడా వచ్చింది కదా. అయితే ఆరోగ్య నిపుణులు అభిప్రాయ ప్రకారం చూస్తే, ముదురు గులాబి రంగులో లేకా తెల్లటి పూతతో మరియు మచ్చలు లేకుండా ఉండటమే ఆరోగ్యకరం. అయితే నాలుకపై తేమ అనేది లేకపోవడం కూడా వ్యాధికి సంకేతం అని గుర్తుంచుకోండి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది