Tongue : బ్రష్ చేసే టైంలో నాలుక నుండి రక్తం వస్తుందా… కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tongue : బ్రష్ చేసే టైంలో నాలుక నుండి రక్తం వస్తుందా… కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,5:00 pm

Tongue : సాధారణంగా ప్రతి ఒక్కరు ఉదయాన్నే బ్రష్ చేసుకుంటారు. అయితే బ్రష్ చేసే టైంలో కొంతమందికి నాలుక నుండి రక్తస్రావంలో కావటం సహజం. అయితే నాలుక బలహీనంగా మారటం మరియు తీసుకునే ఆహారంలో తప్పులు ఇలా కొన్ని కారణాల వలన ఈ సమస్యలు అనేవి తలెత్తుతాయి. మనలో ఎంతో మంది ఏదో ఒక టైం లో ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాగే నాలుగు పై నుండి కూడా రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే బ్రష్ చేసే టైంలో నాలుగు పై రక్తం వస్తే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాం…

మన నాలుక పై పాపిల్లే అనే ఒక నిర్మాణం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో నాలుకను కొరకటం లేక గట్టిగా బ్రష్ చేయటం వలన కూడా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పైనాపిల్ లాంటి ఆమ్ల పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. అలాగే నోటిలో ఉండే కొన్ని పుండ్ల వలన కూడా నాలుక పై రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది అని నిపునులు అంటున్నారు. అయితే మన నాలుకపై ఏర్పడే బొబ్బలు మనం బ్రష్ చేసే టైం లో పగలటం వలన నాలుక పై రక్తం వస్తుంది. అయితే మన నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే నోటిపై మచ్చలు, నాలుకపై దురద లాంటి లక్షణాలు ఇన్ఫెక్షన్లకు కారణమని చెప్పొచ్చు…

అయితే కొన్ని సందర్భాలలో కూడా విటమిన్ బి12 లోపం వలన రక్త స్రావం అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఈ విటమిన్ లోపం వలన నాలుక ఎంత బలహీనంగా తయారవుతుంది. అలాగే హేమాంగియోమా కారణంగా కూడా నాలుక నుండి రక్తస్రావం అవుతుంది. అయితే మన నాలుక పై ఉండే రక్త నాళాలు పెరగడం వలన ఈ సమస్య అనేది వస్తుంది. అలాగే నాలుక నుండి రక్తం కారడం అనేది క్యాన్సర్ కు సంకేతం కావచ్చని అంటున్నారు నిపునులు. అలాగే నాలుకపై గడ్డలు ఏర్పడిన మరియు గొంతు నొప్పి తరచుగా వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది…

Tongue బ్రష్ చేసే టైంలో నాలుక నుండి రక్తం వస్తుందా కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు

Tongue : బ్రష్ చేసే టైంలో నాలుక నుండి రక్తం వస్తుందా… కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు..!

ఇలా చేయండి : ఒకవేళ మీ నాలుక నుండి రక్తస్రావం గనక అవుతుంటే, ఒక గుడ్డతో దానిని వత్తి పట్టాలి. ఇలా చేయటం వలన రక్తస్రావం అనేది వెంటనే ఆగిపోతుంది. అలాగే ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి నాలుకపై రుద్దిన కూడా రక్తస్రావం అనేది ఆగుతుంది. మీరు రోజు తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. అలాగే మసాలాలు మరియు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే రక్తస్రావం అయ్యే ప్రాంతంలో బ్లాక్ టీ బ్యాగ్ ను ఉంచిన కూడా రక్తస్రావం అనేది ఆగిపోతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది