Tongue : మీ నాలుక రంగు మారిందా…ఇది క్యాన్సర్ కు సంకేతం…!
Tongue : ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి మరణాలలో క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉన్నది అని చెప్పొచ్చు. క్యాన్సర్ మహమ్మరి చాప కింద నీరుల జనాల ప్రాణాలను తీస్తుంది. ఈ వ్యాధి పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి వ్యాపిస్తుంది. అలాగే అనా రోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం మెడికల్ ఫీల్డ్ ఎంతగా అభివృద్ధి చెందిన క్యాన్సర్ ఇప్పటికీ ప్రాణాంతకమైన వ్యాధిగానే చెబుతున్నారు. ఈ క్యాన్సర్ ను మొదట దశలోనే చికిత్స అందించకపోతే రోగి మరణించే అవకాశం కూడా ఉన్నది. అయితే సరైన టైంలో చికిత్స అనేది ప్రారంభించినట్లయితే ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు అని అంటున్నారు…
శరీరంలో క్యాన్సర్ అనేది ఎప్పుడు పుడుతుందో మొదట్లోనే చాలా మందికి అర్థం కాదు. కానీ ఈ వ్యాధి కణాలు శరీరంలోనికి ప్రవేశించిన తరువాత కొన్ని ముఖ్య లక్షణాలకు మాత్రం కనబడతాయి. ఈ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు ముందుగా గ్రహించి చికిత్స మొదలుపెట్టడం వలన దీనిని సమూలంగా నాశనం చేయడం సాధ్యం అవుతుంది అని అంటున్నారు. నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, క్యాన్సర్ శరీరంలో కి వెళ్లేటప్పుడు నాలుక రంగు కూడా మారటం మొదలవుతుంది. దీనిని గమనించినట్లయితే అసలు ఆలస్యం చేయకండి. మీరు వెంటనే వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.
అయితే కొన్ని ఆహారాలు తిన్న తరువాత కూడా నాలుక నుండి పదే పదే రక్తస్రావం అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇది క్యాన్సర్ కి సంకేతం అని చెప్తున్నారు. అలాగే నాలుకను బయటకు తీసేటప్పుడు కూడా నొప్పి అనిపించినా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇది కూడా క్యాన్సర్ కి సంకేతమే. రోజురోజుకు క్యాన్సర్ మరణాలు పెరగటానికి అనారోగ్యకరమైన ఆహారం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అంతేకాక అధిక జంక్ ఫుడ్ నుండి ధూమపానం వరకు మద్యం సేవించడం నుండి కాలుష్యం వరకు ఇవన్నీ కూడా క్యాన్సర్ కు కారకాలు అని చెప్పొచ్చు…