Home » Devotional » Horoscope August 2022 Check Your Zodiac Signs Sagittarius
Devotional

Zodiac Signs : ధనుస్సు రాశి వారికి, ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Authored By
aruna
The Telugu News | Published on: July 30, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : ఆగస్టు నెల, 2022, ధనస్సు రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11 వ తారీకు వరకు కలిసి ఉండి కుజుడు 11 వ తారీఖు తర్వాత వృషభం లోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21 వ తారీకు వరకు సింహరాశిలో ఉండి ఆ తరువాత కన్యారాశి లోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ధనుస్సు రాశి వారు కొన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అలాగే రావాల్సినటువంటి ధనం తొందరపడి తీసుకోకపోతే మళ్లీ అదే పెండింగ్ లో పడుతుంది. భూమి, గృహము, పంట పొలాలు, రియల్ ఎస్టేట్ ప్లేసులు అమ్మకానికి పెట్టి ఉంటే వీటికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కొన్ని విషయాలలో మార్పులు చేసుకుంటారు. సంతానం కోసం ప్రయత్నించేవారు పదకొండవ తారీకు వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్లు 11వ తేదీ తర్వాత విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏడవ తేది తర్వాత ఫలించే అవకాశం ఉంది.

horoscope august 2022 check your zodiac signs Sagittarius

Advertisement

21వ తేదీ తర్వాత వ్యాపారం మొదలు పెట్టడానికి విదేశాలకు వెళ్లడానికి భాగస్వామి చేత బిజినెస్ పెట్టించడానికి ఈ యొక్క గ్రహస్థితి తోడ్పడుతుంది. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏమిటంటే కుజుడు, రాహువు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకు బెల్లం ఉండలు తినిపించాలి. అలాగే క్యారెట్లను తినిపించాలి. నరసింహస్వామి లేదా కుమారస్వామి లేదా దుర్గామాతను ఆరాధించాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ధనుస్సు రాశి గురించి మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి