Zodiac Signs : ఆగస్టు నెల, 2022, కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11వ తారీకు వరకు కలిసి ఉండి కుజుడు 11వ తారీఖు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు ఈ యొక్క బుధుడు 21వ తారీకు వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత కన్యారాశి లోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కన్యారాశి వారు వేరే దేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలలో సేవలు అందుకుంటారు. 21వ తేదీ నుంచి ఎప్పుడైతే ఈ రాశిలో బుధుడు యొక్క బలం పెరుగుతుందో దాని వలన వ్యాపారం, ఉద్యోగం, వైద్య సంబంధించిన రంగాలలో అన్ని మంచి ఫలితాలు వస్తాయి. గతంలో ఉద్యోగానికి సంబంధించిన ధనం ఏదైతే ఆగిపోయిందో ఇప్పుడు అది వస్తుంది. అలాగే ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తులకు సంబంధించిన విషయాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఒత్తిడి తగులుతుంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయట పడాలంటే కేతువు గ్రహానికి దీపారాధన చేయాలి. కేతువు గ్రహం దగ్గర ఒక దీపం పెట్టి కొన్ని పుష్పాలు, కొంచెం కుంకుమ వేసి ప్రదక్షిణలు చేయాలి.
అలాగే ఈ రాశి వారికి గృహ సంబంధిత రుణాలు లభిస్తాయి. అలాగే 11వ తేదీ వరకు అగ్నికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా వహించాలి. బ్యాంకు ట్రాన్సాక్షన్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి సహోదరులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. రాశి వారికి దైవానుగ్రహం ఉంటుంది. అన్ని పనులలో విజయాలను అందుకుంటారు. అయితే కన్య రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. శని భగవానుడి దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. కన్య రాశి గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
This website uses cookies.