Rasi Phalalu : 2024 లో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఇవే...
Rasi Phalalu : 2024 నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో మనం తెలుసుకుందాం.. 2024వ సంవత్సరంలో ద్వాదశి రాశిలలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టపోతుంది. ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు. దాదాపుగా 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి గురు గ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. 2024వ సంవత్సరం మే నెల ఒకటో తేదీ గురువు మేషరాశిలో నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గురువు సంచారంలో మార్పు వల్ల 2024 ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది.
మేషరాశి :
మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభరాశి రెండో రాశి అవుతుంది. అంటే మేష రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది. ద్వితీయమంటే కుటుంబ స్థానం కాబట్టి మేష రాశి వాళ్ళకి 2024లో కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ధనపరంగా బాగా కలిసొస్తుంది. ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మీ మాటకు విలువ గౌరవము పెరుగుతాయి. కాబట్టి వాక్కు పరంగా ధనం పరంగా కుటుంబ జీవితం పరంగా మేష రాశి వారికి 2024లో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది.
మకర రాశి:
మకర రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాసి అవుతుంది. అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు. మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. సంతానం లేని మకర రాశి వారికి 2024లో కచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళటానికి 2024 సంవత్సరంల మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాసి మకర రాశి.
వృశ్చిక రాశి:
ఈ వృశ్చిక రాశివారికి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి గురువు ఏడో సంచారం చేస్తున్నాడు. ఈ సప్తమ సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి 2024లో కచ్చితంగా పెళ్లిళ్లు అవుతాయి. చాలాకాలంగా పెళ్లిళ్లవక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి 2024లో కచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లిళ్లు అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు ఈ 2024లో కచ్చితంగా కలుస్తారు. సమస్యలు అన్ని తొలగిపోయే వృశ్చిక రాశి వారికి 2024లో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది.
కన్యా రాశి:
కన్యా రాశి వాళ్ళకి గురువు ఈ 2024 లో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు. అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు. పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ల మీద పడుతుంది. కన్యా రాశి వాళ్లు పట్టిందల్లా బంగారాల్లా ఉంటుంది. ఆర్థికంగా కన్యారాశి వాళ్లకు తిరుగు ఉండదు. విపరీతంగా ధన లాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులు తొలగిపోతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఈ 2024 లో మే నుంచి లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం 11వ స్థానం. కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ 2024లో తిరుగు ఉండదు. ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు. డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు ఏ రంగంలో ఉన్న మీరే నెంబర్ వన్ గా చక్రాలు తిప్పుతారు. ఆకస్మిక ధనప్రాప్తియోగం కూడా కలుగుతుంది. అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళు 2024లో గురు బలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
Coriander | వంటకాలకు రుచి, సువాసనను అందించే కొత్తిమీర (Coriander) ప్రతి వంటగదిలో తప్పనిసరి పదార్థం. తాజా ఆకులు, ఎండిన గింజలు,…
Devi Navaratri 2025 | నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో భక్తులు…
This website uses cookies.