Zodiac Signs : ఆగస్టు 7 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Advertisement

మేష రాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. శ్రమ బాగా పెరుగుతుంది. విలువైన వస్తువులను కొంటారు. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు. మీరు చేసిన అప్పులు ఈరోజు తీర్చే అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం తగ్గుతుంది దీనికోసం బాగా శ్రమ చేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. కొత్త అవకాశాలు వస్తాయి. పెద్దల పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శ్రీ ఆదిత్యహృదయం పారాయణం చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలలో పెరుగుదల కనిపిస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులు కొంటారు. గతంలో పెట్టుబడులు లాభాలు వస్తాయి. సంతానం వల్ల ప్రయోజనాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బందులు. చేసే పనులలో ఆటంకాలు. అవసరాలకు డబ్బు అందుతుంది. అన్ని పనులలో శ్రమాధిక్యత. కుటుంబంలో చికాకులు. ప్రయాణాల్లో ఆటంకాలు. వృత్తి,వ్యాపారాల స్వల్ప లాభాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

Advertisement
Today Horoscope August 7 2022 Check Your Zodiac Signs
Today Horoscope August 7 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : అనుకోని విధంగా లాభాలు వస్తాయి. అన్నింటా పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. దూరప్రయాణ సూచన. బంధవులు ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆస్తి సంబంధ వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్ని సానుకూలమైన ఫలితాలు.శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలు వస్తాయి. తొందరపాటు వల్ల ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో మార్పులు సంభవిస్తాయి. ఆదాయం తగ్గుతుంది. కానీ మీరు అవసరాలను ఏదో విధంగా తీర్చుకుంటారు. అక్కచెల్లల ద్వారా మంచి వార్తలు వింటారు. గోసేవ, గోవులకు శనగలు పెట్టడండి మంచి ఫలితాలు వస్తాయి.

తులారాశి ఫలాలు : మీరు మంచి పనులు ప్రారంభిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. అన్నింటా సానకూలమైన రోజు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ద్వారా మంచి సలహాలను పొందుతారు. శ్రీ రామ తారకాన్ని వీలైనన్ని సార్లు జపించండి.

వృశ్చికరాశి ఫలాలు : విదేశాలకు వెళ్లాలని చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. అదాయ మార్గాలను అన్వేషిస్తారు.
బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. మీరు కొత్త వాహనాల కొనుగోలు చేస్తారు. అన్ని పనులలో, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. చేసే పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేయలేక ఇబ్బంది పడుతారు. అన్నింటా చికాకులు కలుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. రుణాల కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలలో జాయింట్‌ వెంచర్‌కు అవకాశాలు లేవు. ప్రయాణ సూచన. ఇబ్బందులు. శ్రీ దుర్గా దేవి ఆరాధన చేయండి.,

మకర రాశి ఫలాలు : చాలా సంతోషకరమైన రోజు. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా సానుకూలత కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు. విద్యా, వివాహం, విదేశీ ప్రయాణం వంటి అంశాలలో చక్కటి శుభఫలితాలు. ఇష్టదేవతరాధన చేయండి,.

కుంభ రాశి ఫలాలు : మీరు చేపట్టే పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నింటా జయం సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. ప్రేమికులకు మంచి రోజు. విందులు, వినోదాలు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : వివాదాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులు బాగా కష్టపడాల్సినరోజు. సమయం విలువ తెలుసుకుని ముందుకు పోవాలి. ఆదాయం తగ్గుతుంది. అనవసర ఖర్చులు వస్తాయి. వివాహప్రయత్నాలు మాత్రం అనుకూలం. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

Advertisement
Advertisement