After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : ఆరోగ్య విషయలో జాగ్రత్త వహించాలి. అనుకూలమైన వాతావరణం కోసం బాగా శ్రమించాల్సిన రోజు. అతిగా ఖర్చులు పెడుతారు. మీ కలలు సాకారం అయ్యే రోజులు దగ్గరగా ఉన్నాయి ఓపకితో పనిచేయండి. విందులు, వినోదాలు. భాగస్వామితో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు చాలా ప్రశాంతంగా గడుపుతారు.చాలా కాలంగా ఉన్న వత్తిడి కాస్త తగ్గుతుంది. ఆనందంగా, సంతోషంగా గడపటానికి ప్రయత్నిస్తారు. మీ నిత్య జీవిన విధానాన్ని మార్పు చేయడానికి అనుకూలమైన రోజు. ధనాన్ని బాగానే సంపాదిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. అమ్మవారి దగ్గర దీపారాధన ఎరుపు వత్తులతో చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలను తీసుకుంటారు. చాలా రోజుల తర్వాత విశ్రాంతి లభిస్తుంది. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు సంతోషాన్ని కలిగిస్తారు, ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఈరోజు చేయకండి. దూరప్రయాణానికి అవకాశం ఉంది. ఆఫీస్‌లో మీకు ప్రశంసలు వస్తాయి. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆధ్యాత్మిక ఆలోచనలు, యోగా వైపు మీరు దృష్టి పెడుతారు. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. శుభకార్య నిర్వహణకు అవకాశం. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది.
కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన రోజును గడుపుతారు. మీలో విశ్వాసం పెరుగుతోంది, అన్ని పనులలో అభివృద్ధి కానవస్తోంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope August 9 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. కుటుంబంలో సంతోష వాతావరణం. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు పనులు వేగంగా జరుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : అన్నింటా మీరు విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది,. పనులను ఏకాగ్రతతో చేయాలి. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆనుకోని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు. సాయంత్రం నుంచి మీరు మంచి ఫలితాలను పొందుతారు. జీవిత భాగస్వామి మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి.
తులా రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆన్నింటా మీరు ఆటంకాలను అధిగమించి ముందుకుపోతారు. చిరునవ్వులతో ముందుకుపోతారు. ఇంటికి అనుకోని అతిథులు రాక. కుటంబంలో మార్పులు వస్తాయి. మహిళలకు లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అన్ని ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త నిర్వహించాల్సిన రోజు. కొత్త పెట్టుబడులకు అంత అనకూలం కాదు. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. మహిళలపై పనిభారం పెరుగతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అనుకోని నష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. ప్రేమికులకు ఇబ్బందికరమైన రోజు. ఆరోగ్యం కోసం తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో వివాదాలకు అవకాశం ఉంది. అవసరానికి ధనం చేతికి అందక ఇబ్బంది పడుతారు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కోపతాపాలకు అవకాశం ఉంది. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ధనం సంపాదించడానికి కష్టపడుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సాయంత్రం నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఆరోగ్యం బాగుంటుంది. ధన సంబంధ విషయాలు అనుకూలత కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సాయంత్రం నుంచి ప్రయాణ సూచన. శుభవార్తలు వింటారు. అన్నింటా సంతోషకరమైన రోజు. మహిళలకు ధనలాభాలు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు మంచిరోజు. అన్నింటా మీకు అనుకూలతలుల పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ, ఉపాధి విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఈరోజు ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని కలిగించే పనులు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
This website uses cookies.